IRCTC Package: కాశ్మీర్‌ను టూర్ కోసం ప్లాన్ చేస్తున్నారా.. IRCTC గొప్ప ఆఫర్.. వివరాలు ఇవే..
మీరు ఆగస్ట్ నెలలో కాశ్మీర్‌ను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే.. IRCTC గొప్ప ఆఫర్‌లను కల్పిస్తోంది. పూర్తి వివరాలను తెలుసుకోండి..
ప్రతి నెలా, రైల్వే తన ప్రయాణీకుల కోసం ప్రత్యేక ప్యాకేజీలను తీసుకువస్తూనే ఉంటుంది. ఆగస్ట్‌లో IRCTC శ్రీనగర్, సోన్‌మార్గ్, గుల్‌మార్గ్, పహల్గామ్‌లను సందర్శించడానికి ప్రయాణీకులకు గొప్ప అవకాశాన్ని కల్పించింది. మీరు కూడా ఈ నెలలో కాశ్మీర్ వెళ్లాలనుకుంటే ఈ ప్యాకేజీ మీకు ఉత్తమమైనది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఈ IRCTC ప్యాకేజీ పేరు జ్యువెల్స్ ఆఫ్ కాశ్మీర్ ఎక్స్ అమృత్‌సర్. ఇందులో మీ ప్రయాణం 6 పగళ్లు, 5 రాత్రులు ఉంటుంది. ఈ ప్రయాణంలో మీరు విమానంలో శ్రీనగర్, సోన్‌మార్గ్, పహల్గామ్, గుల్‌మార్గ్‌లలో సాగుతుంది.
ప్యాకేజీ ఛార్జీల గురించి మాట్లాడితే, ఈ ప్యాకేజీలో ఒక వ్యక్తి రూ. 39,650 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి వెళితే ఒక్కొక్కరికి రూ. 27,140, ముగ్గురు వ్యక్తుల బృందం ఒక్కొక్కరికి రూ. 26,490 చెల్లించాలి.
ఈ ప్యాకేజీలో మీకు GoFirst విమాన టిక్కెట్‌తో పాటు శ్రీనగర్‌లోని హోటల్ సౌకర్యం కూడా అందించబడుతుంది. ఇది కాకుండా, మీరు శ్రీనగర్‌లోని హోం ఔట్ లో కూడా ఒక రాత్రి గడపగలరు. ఇందులో మీరు 5 బ్రేక్‌ఫాస్ట్‌లు, 5 డిన్నర్లు కూడా చేయవచ్చు.
ఇది కాకుండా, మీరు అధికారిక లింక్ ని సందర్శించడం ద్వారా ప్యాకేజీ గురించి పూర్తి వివరాలను కూడా తీసుకోవచ్చు.
మరిన్ని టూరిజం వార్తల కోసం..