Health: ఉదయం లేవగానే కడుపు నొప్పి వేధిస్తుందా.? సింపుల్‌ చిట్కా పాటించండి

|

Jun 22, 2024 | 2:34 PM

తీసుకునే ఆహారంలో మార్పులు, అర్థరాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, అనారోగ్యకరమై ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. అలాగే చురుకైన జీవనశైలి లేకపోవడం, క్రమ రహిత ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్‌, ఎసిడిటీ సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఉదయం నిద్రలేవగానే విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. ఇంతకీ సమస్యకు ఎలా చెక్‌ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Health: ఉదయం లేవగానే కడుపు నొప్పి వేధిస్తుందా.? సింపుల్‌ చిట్కా పాటించండి
Stomach Pain
Follow us on

మనలో చాలా మందికి ఉదయం లేవగానే కడుపు నొప్పి సమస్య వేధిస్తుంటుంది. రాత్రంతా బాగానే ఉన్నా ఉదయం లేవగానే తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి నొప్పికి గ్యాస్‌ ప్రధానకారణమని నిపుణులు చెబుతుంటారు. గ్యాస్, ఎసిడిటీ కారణంగా ఇలా ఉదయం లేవగానే కడుపనొప్పి వేధిస్తుంది. అయితే ఈ సమస్యకు వంటింట్లో లభించే వస్తువుతోనే చెక్‌ పెట్టొచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తీసుకునే ఆహారంలో మార్పులు, అర్థరాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, అనారోగ్యకరమై ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. అలాగే చురుకైన జీవనశైలి లేకపోవడం, క్రమ రహిత ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్‌, ఎసిడిటీ సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఉదయం నిద్రలేవగానే విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. ఇంతకీ సమస్యకు ఎలా చెక్‌ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలాంటి గ్యాస్‌ సంబంధిత సమస్యలకు జీలకర్ర దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం రెండు టీ స్పూన్ల జీలకర్రను తీసుకొని గ్లాసు నీటిలో నాన బెట్టాలి. రాత్రంతా నానబెట్టిన ఈ నీటిని ఉదయం లేవగానే పడగడుపున తాగాలి. ఒకవేళ రాత్రంతా నానబెట్టడం మర్చిపోతే.. కొన్ని నీటిలో 2 చెంచాల జీలకర్రను వేసి కాసేపు మరిగించి, చల్లార్చి తాగాలి దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. దీనివల్ల ఉదయం తలెత్తే కడుపు సంబంధిత సమస్యల నుంచి బయటపడొచ్చు.

దీంతో పాటు తులసి, మిరియాలను వేడి నీటిలో వేసుకొని తాగినా ఉపశమనం లభిస్తుంది. ఉదయం కడుపు నొప్పి సమస్యతో బాధపడేవారు జీవనశైలిని జీవనశైలిని మార్చుకోవాలి. రాత్రి మిగిలిన ఆహారాన్ని తీసుకోవడం మానేయాలి. అలాగే వీలైనంత వరకు రాత్రుళ్లు త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను కలిగించే ఆహారాలకు దూరంగా ఉండాలి. కొందరిలో పాలు తాగినా గ్యాస్‌ సమస్యలు వస్తాయి కాబట్టి రాత్రి పడుకునే ముందు పాలు తీసుకోవడం మానేయాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..