AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొండలా పేరుకు పోయిన ఐస్‌ను క్లీన్‌ చేయడానికి స్క్రూ డ్రైవర్‌ను ఉపయోగిస్తున్నారా.? మీ ఫ్రిడ్జ్‌ పని గోవిందా..

ఫ్రిడ్జ్‌ను ఉపయోగించే క్రమంలో పలు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటి వాటిలో డీప్‌ ఫ్రిడ్జ్‌లో పేరుకుపోయే ఐస్‌ ఒకటి. కొన్ని సమయాల్లో డీప్‌ బాక్సులో ఐస్‌ మంచులా పేరుకుపోతుంది. దీంతో..

కొండలా పేరుకు పోయిన ఐస్‌ను క్లీన్‌ చేయడానికి స్క్రూ డ్రైవర్‌ను ఉపయోగిస్తున్నారా.? మీ ఫ్రిడ్జ్‌ పని గోవిందా..
Ice In Fridge
Narender Vaitla
|

Updated on: Mar 10, 2023 | 4:01 PM

Share

ఒకప్పుడు ఫ్రిడ్జ్‌ అంటే ఒక విలాసవంతమైన వస్తువుగా భావించేవారు. కేవలం కొందరి ఇళ్లలోనే ఇవి కనిపించేవి. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. ఫ్రిడ్జ్‌ అనేది ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అందుబాటులో ధరల్లో ఉండడం, బ్యాంకులు ఈఎమ్‌ఐ ఆఫర్లు సైతం ప్రకటిస్తుండడంతో అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్‌ ఒక కామన్‌ వస్తువుగా మారిపోయింది. ఇక ఫ్రిడ్జ్‌ను ఉపయోగించే క్రమంలో పలు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటి వాటిలో డీప్‌ ఫ్రిడ్జ్‌లో పేరుకుపోయే ఐస్‌ ఒకటి. కొన్ని సమయాల్లో డీప్‌ బాక్సులో ఐస్‌ మంచులా పేరుకుపోతుంది. దీంతో లోపల ఏ వస్తువు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు.

ఇలా పేరుకు పోయిన ఐస్‌ను క్లీక్‌ చేయడానికి కొందరు స్క్రూ డ్రైవర్లను ఉపయోగిస్తుంటారు. స్క్రూ డ్రైవర్‌ను ఐస్‌పై కొడుతూ తొలగిస్తుంటారు. అయితే ఇలా చేసే సమయాల్లో ఫ్రిడ్జ్‌ డ్యామేజ్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో ఉండే డీప్‌ బాక్సును గమనిస్తే.. సైడ్స్‌లో సన్నని లైన్స్‌ ఉంటాయి. వీటి గుండా ప్రవహించే గ్యాస్‌ ఆధారంగానే ఫ్రిడ్జ్‌ చల్లగా మారుతుంది. అయితే స్క్రూ డ్రైవర్‌తో అవగాహన లేకుండా కొడితే గ్యాస్‌ ప్రవహించే మార్గానికి రంధ్రం పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలా కనుగ జరిగితే. ఫ్రిడ్జ్‌లో గ్యాస్‌ పూర్తిగా లీక్‌ అవుతుంది.ఈ కారణంగా ఫ్రిడ్జ్‌ కూల్‌గా మారదు. కొన్ని సందర్భాల్లో ఇది కంప్రెషర్‌ పాడవడానికి కూడా కారణంగా మారుతుంది. డీప్‌ బాక్సును మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డీప్‌లో పేరుకుపోయిన మంచును తొలగించడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే..

* సాధారణంగా డీప్‌ బాక్సులో ఐస్‌ పేరుకుపోవడానికి ప్రధాన కారణం.. ఫ్రిడ్జ్‌లో తేమ ప్రవేశించడమే. అందుకే ఫ్రిడ్జ్‌ను పదే పదే తెరవడం, గ్యాప్‌ ఉండేలా డోర్‌ని మూయకపోవడం లాంటి చేయకూడదు.

* ఇక ఐస్‌ పేరుకుపోతే వెంటనే నెంబర్‌ను తగ్గించి, మధ్యలో ఉండే బట్‌ను నొక్కాలి. అప్పుడు ఫ్రిడ్జ్‌ కూలింగ్ పూర్తిగా తగ్గిపోయి ఐస్‌ కరిగిపోతుంది.

* ఫ్రిజర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. అలాగే ఫ్రిజ్‌ను కచ్చితంగా డీఫ్రాస్ట్ కూడా చేస్తుండాలి. ఓ గంట పాటు ఫ్రిజ్‌ను స్విచ్ఛాప్ చేసినా కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయి.

* ఫ్రిడ్జ్‌లో ఉండే కండెన్సర్‌ కాయిల్‌పై దుమ్ముధూళి పేరకుపోయినా ఇలాంటి సమస్య వస్తుంది. కాబట్టి.. కండెన్సర్ కాయిల్‌ను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్