Thyroid: థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా.? నిపుణులు ఏమంటున్నారంటే..
మహిళల్లో ఎక్కువగా కనిపించే థైరాయిడ్ వారిలో పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్ హార్మోన్లను తగిన స్థాయిలో ఉత్పత్తి చేయకపోతే దానిని హైపోథైరాయిడిజం సమస్యగా, థైరాయిడ్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయితే దానిని హైపర్ థైరాయిడిజం సమస్యగా చెబుతుంటారు. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు గర్భం దాల్చం..

థైరాయిడ్ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ప్రపంచంలోని ప్రతీ 8 మంది మహిళల్లో ఒకరు థైరాయిడ్‌తో బాధపడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. ఒక్కసారి థైరాయిడ్ వచ్చిందంటే అంత సులువుగా తగ్గదు. అంతేకాకుండా థైరాయిడ్ కారణంగా ఎన్నో ఇతర సమస్యలకు కారణమవుతుంది.
మహిళల్లో ఎక్కువగా కనిపించే థైరాయిడ్ వారిలో పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్ హార్మోన్లను తగిన స్థాయిలో ఉత్పత్తి చేయకపోతే దానిని హైపోథైరాయిడిజం సమస్యగా, థైరాయిడ్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయితే దానిని హైపర్ థైరాయిడిజం సమస్యగా చెబుతుంటారు. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు గర్భం దాల్చం అంతసులువైన విషయం కాదని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.? నిజంగానే థైరాయిడ్ ఉంటే గర్భం దాల్చలేరా.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
థైరాయిడ్ ఉన్న మహిళలు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందనడంలో నిజం ఉన్నా.. శాశ్వతంగా పిల్లలు పుట్టరనడంలో ఎలాంటి నిజం లేదని వైద్యులు చెబుతున్నారు. థైరాయిడ్ ఉన్న మహిళలు కూడా గర్భం దాల్చవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, కొన్నిసార్లు వారు గర్భం దాల్చడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు, కానీ జీవనశైలిని మెరుగ్గా ఉంచుకుంటే దానిలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. గర్భం దాల్చిన తర్వాత థైరాయిడ్‌లో మరిన్ని సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇది తల్లి, బిడ్డ ఇద్దరి సమస్యలను పెంచుతుంది.
సాధారణంగా థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి గర్భధారణ సమయంలో హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం సమస్యలకు కారణమవుతాయి. హైపోథైరాయిడిజం వంధ్యత్వం, గర్భస్రావం, ప్రీక్లాంప్సియా, రక్తహీనత, ఉన్నపలంగా బరువు తగ్గడం, బరువు పెరగడం వంటి సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. అలాగే హైపర్ థైరాయిడిజం గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు, నెలలు నిండకముందే పిల్లలు పుట్టడం, కడుపులో ఉన్న పిండం మెదడుపై ప్రభావం చూపుతుంది. చిన్నారుల ఐక్యూపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఒకవేళ థైరాయిడ్ ఉన్న స్త్రీలు గర్భందాల్చితే.. వారు క్రమం తప్పకుండా రక్త పరీక్షలను చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే వైద్యులు సూచించిన మందులను క్రమంతప్పకుండా తీసుకోవాలి. తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆహారం సమతుల్యంగా, పోషకాహారంతో ఉండాలని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




