పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? అయితే జామాకులతో ఇలా చేయండి.. నొప్పి క్షణాల్లో మాయం..

పంటి నొప్పి.. ఈ సమస్య చాలా మందిని వేధిస్తుంది. ఇక ఒక్కోసారి రెండు మూడు రోజులకు కూడా ఈ సమస్య తీవ్రంగా

పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? అయితే జామాకులతో ఇలా చేయండి.. నొప్పి క్షణాల్లో మాయం..
Tooth Ache

Updated on: Apr 28, 2021 | 2:37 PM

పంటి నొప్పి.. ఈ సమస్య చాలా మందిని వేధిస్తుంది. ఇక ఒక్కోసారి రెండు మూడు రోజులకు కూడా ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంటే డాక్టర్లను సంప్రదిస్తారు. అయితే నొప్పి మరింత ఎక్కువగా కాకముందే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే నొప్పిని తగ్గించుకోవచ్చు.

1. పంటినొప్పిని ఉప్పు నీటితో మౌత్ వాష్ చేసుకుంటే ఈ సమస్య తగ్గిపోతుంది. నాచురల్ డిస్ఇంఫెక్టెంట్ అయిన సాల్ట్ వాటర్ పళ్ళ మధ్య ఇరుక్కుని ఉండిపోయిన ఆహార పదార్థాలని బయటకి లాగేస్తుంది. పంటినొప్పిని ఉప్పు నీటితో ట్రీట్ చేయడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ రెడ్యూస్ అయ్యి ఇంకేవైనా చిన్న చిన్న నోటి పుండ్లు ఉంటే కూడా తగ్గిపోతాయి. ఇలా చేయడానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటిని మౌత్ వాష్‌లా ఉపయోగించండి.

2. మన ఇంట్లో విరివిగా వాడే వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణలుంటాయన్న సంగతి తెలిసిందే. ఇది హానికారక బ్యాక్టీరియాని చంపడమే కాక పెయిన్ రిలీవర్‌గా కూడా పని చేస్తుంది. ఇలా చేయడానికి ఒక వెల్లుల్లి రెమ్మని పేస్ట్ చేసి ఆ పేస్ట్‌ని నొప్పి ఉన్న ప్రదేశం లో ఉంచండి. ఈ పేస్ట్‌కి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేయవచ్చు. లేదంటే తాజా వెల్లుల్లి రెమ్మని నెమ్మదిగా నమిలినా కూడా సరిపోతుంది.

3. పంటి నొప్పికి లవంగాలు వాడడం అనేది కూడా మనకి ఎప్పటి నుండో తెలిసిన విషయమే. ఇలా చేయడానికి ఒక కాటన్ బాల్ మీద కొద్దిగా లవంగ నూనె తీసుకుని దాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచండి. ఈ లవంగనూనెని కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్, లేదా నీటితో డైల్యూట్ చేసి వాడండి. ఇలా రోజుకి కొన్ని సార్లు చేయవచ్చు. ఒక చిన్న గ్లాసు నీటిలో కొన్ని చుక్కల లవంగం నూనె వేసి మౌత్ వాష్ లాగా ఉపయోగించవచ్చు.

4. జామాకులలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన పుండ్లు త్వరగా తగ్గుతాయి. వీటి యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ ఓరల్ కేర్ లో కూడా హెల్ప్ చేస్తుంది. ఇలా చేయడానికి తాజా జామాకులు నమలండి లేదా కొన్ని జామాకులని కొద్దిగా దంచి వాటిని మరుగుతున్న నీటిలో వేసి మౌత్ వాష్ తయారు చేసుకోండి.

డాక్టర్లను ఎప్పుడు కలవాలంటే..
1. పంటినొప్పితో పాటు జ్వరం వచ్చినప్పుడు .
2. రెండు రోజుల కంటే ఎక్కువ నొప్పి ఉన్నప్పుడు.
3. ఊపిరి తీసుకోవడంలో, మింగడంలో ఇబ్బంది ఉండడం.
4. వాపు, కొరికినప్పుడు నొప్పి ఉండడం.
5. చిగుళ్లు ఎర్రగా ఉండడం.

Also Read: ఆకస్మాత్తుగా నీరసంగా, అలసటగా ఉంటున్నారా ? అయితే నిర్లక్ష్యం చేయకండి.. కోవిడ్ లక్షణాలు కూడా కావచ్చు ?