Summer Tips: ఏసీలు, కూలర్లు మాత్రమే కాదు.. ఈ చిట్కాలు కూడా సమ్మర్‌ హీట్‌ను తరిమికొడతాయి.

మార్చి నెల ఈ మొదలైందో లేదో అల ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు జనాలు ఇప్పుడే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో పాత కూలర్ల దుమ్ముదులిపే పనిని మొదలు పెట్టేశారు. లేని వాళ్లు కొత్తవి కొనే ప్లాన్‌లో...

Summer Tips: ఏసీలు, కూలర్లు మాత్రమే కాదు.. ఈ చిట్కాలు కూడా సమ్మర్‌ హీట్‌ను తరిమికొడతాయి.
Summer Tips

Updated on: Mar 06, 2023 | 5:10 PM

మార్చి నెల ఈ మొదలైందో లేదో అల ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు జనాలు ఇప్పుడే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో పాత కూలర్ల దుమ్ముదులిపే పనిని మొదలు పెట్టేశారు. లేని వాళ్లు కొత్తవి కొనే ప్లాన్‌లో ఉన్నారు. ఏసీలు, కూలర్లు చల్లదనాన్ని ఇస్తాయనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఏసీలు, కూలర్లు మాత్రమే కాకుండా కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కూడా ఇళ్లును చల్లగా ఉంచుకోవచ్చని మీకు తెలుసా.? ఇంతకీ ఏంటా టిప్స్‌, వాటివల్ల ఇళ్లు ఎలా చల్లగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* వేసవిలో వీలైనంత వరకు కిటీలను, తలుపులను తెరిచి ఉంచండి. ముఖ్యంగా ఉదయం అంత విపరీతమైన వేడితో గదిలో వేడి బాగా పెరుగుతుంది. కాబట్టి సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత కిటికీలు, డోర్‌లను తెరిచి ఉండాలి. ఇలా చేయడం వల్ల లోపలి వేడి గాలి బయటకు వెళ్లడంతో పాటు బయటి చల్ల గాలి లోపలికి వస్తుంది.

* డోర్‌, విండో కర్టెన్స్‌ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కర్టెన్స్‌ వీలైనంత వరకు లైట్‌ కలర్స్‌లో ఉండేలా చూసుకోవాలి. మరీముఖ్యంగా వైట్‌ కలర్‌ అయితే బెస్ట్‌. వైట్‌ కలర్‌ హీట్‌ను ఆజ్వర్‌ చేసుకోకపోవడమే దీనికి కారణం.

* ఇక మార్కెట్లో ఇటీవల గడ్డితో కూడిన కర్టెన్స్‌ లభిస్తున్నాయి. వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా దుకాణాల వద్ద ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. వీటిపై తరచూ నీటిని చల్లడం వల్ల గదిలోకి చల్లటి గాలి వస్తుంది.

* వేసవిలో ఇంట్లో మొక్కలను పెంచుకోవాలి. ఇవి చల్లదనాన్ని అందిస్తాయి. ఇంటి లోపల పెంచుకునే మొక్కలకు తరచూ నీటిని పోయడం వల్ల గదిలో చల్లదనం ఏర్పడుతుంది.

* సమ్మర్‌లో ఇంట్లో ఉపయోగించే విద్యుత్‌ దీపాల విషయంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. ఎర్రటి బబ్బుల స్థానంలో తెల్లటి బల్బులను రీప్లేస్‌ చేయాలి. వీటివల్ల గదిలో వేడి తగ్గుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..