Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రి పడుకునే ముందు ఈ పద్ధతులు పాటించండి. రిజల్ట్‌ ఉంటుంది..

| Edited By: Ravi Kiran

Sep 22, 2021 | 7:27 AM

Weight Loss: మారుతోన్న జీవన విధానం, తీసుకుంటోన్న ఆహారం కారణంగా బరువు పెరగడం అనేది ఇటీవల పెద్ద సమస్యగా మారింది. చాలా మంది..

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రి పడుకునే ముందు ఈ పద్ధతులు పాటించండి. రిజల్ట్‌ ఉంటుంది..
Follow us on

Weight Loss: మారుతోన్న జీవన విధానం, తీసుకుంటోన్న ఆహారం కారణంగా బరువు పెరగడం అనేది ఇటీవల పెద్ద సమస్యగా మారింది. చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. దీంతో డైటింగ్‌లు అంటూ వ్యాయామాలు అంటూ జిమ్‌ల బాట పడుతున్నారు.

అయితే మనం ఉదయం అంతా ఎలా ఉంటున్నామన్నదే కాదు.. రాత్రి పడుకునే ముందు మన జీవన విధానం కూడా శరీర బరువుపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా.? రాత్రి పడుకునే ముందు తీసుకునే కొన్ని జాగ్రత్తలతో బరువును చాలా సింపుల్‌గా తగ్గించుకోవచ్చు. ఆ పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* నిద్రకు ఉపక్రమించే కనీసం మూడు గంటల ముందు ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణమేంటంటే భోజనం చేయగానే పడుకుంటే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. అది కొవ్వుగా మారి శరీరంలోని భాగాల్లో పేరుకుపోతుంది. దీంతో బరువు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి వీలైనంత త్వరగా భోజనం చేసి పడుకుంటే మంచిది.

* రాత్రి నిద్ర పోయే ముందు పెప్పర్‌ మింట్‌ టీ లేదా దాల్చిన చెక్క డికాష‌న్‌ను అలవాటు చేసుకోవాలి. దీని వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. నిద్రపోయే సమయంలో క్యాలరీలు ఖర్చుకావడానికి ఇది ఉపయోగపడుతుంది.

* డిన్నర్‌ చేసే సమయంలో భోజనంతో పాటు చిప్స్‌ వంటి స్నాక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. దీని కారణంగా శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చిప్స్‌ కంటే రాత్రి పూట ఏదో ఒక పండు తినే అలవాటు చేసుకోవాలి.

* నిద్రకు ముందు తీసుకునే ఆహారంలో పిండి ప‌దార్థాలు కాకుండా ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. ఇక పండ్లు, కూరగాయలతో చేసిన స‌లాడ్‌, పాలు వంటివి అలవాటు చేసుకోవాలి.

* మద్యం కూడా జీర్ణ క్రియను దెబ్బ తీస్తుంది. కాబట్టి రాత్రి పూట మద్యం సేవించగానే ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదు. కొంచెం గ్యాప్‌ తీసుకుంటే మంచిది. ఇలాంటి సింపుల్‌ టిప్స్‌ ఫాలో అవడం ద్వారా క్రమంగా బరువును కంట్రోల్‌ చేసుకోవచ్చు.

Also Read: Beauty Tips: మృదువైన చర్మం కోసం 5 చిట్కాలు..! కొద్ది రోజుల్లోనే తేడా గమనిస్తారు..

ఈ 5 కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి..! అవేంటో తెలుసుకోండి..

ఈ పదార్థాలు తిన్నాక పాలు పొరపాటున కూడా తాగొద్దు.. ఒకవేళ తాగితే ఈ సమస్యలు తప్పవు.. అవెంటో తెలుసుకొండి..