Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cardamom: యాలకుల పెంపకంతో లక్షలు సంపాదించవచ్చు..! సాగు ఎలా చేయాలో తెలుసుకోండి..

Cardamom: సుగంధ ద్రవ్యాల రాణిగా యాలకులను పిలుస్తారు. దాదాపుగా భారతీయ వంటకాలలో ఎక్కువగా వాడుతారు. ఆహార రుచిని, వాసనను పెంచడానికి ఉపయోగిస్తారు.

Cardamom: యాలకుల పెంపకంతో లక్షలు సంపాదించవచ్చు..! సాగు ఎలా చేయాలో తెలుసుకోండి..
Cardamom
Follow us
uppula Raju

|

Updated on: Sep 21, 2021 | 10:21 PM

Cardamom: సుగంధ ద్రవ్యాల రాణిగా యాలకులను పిలుస్తారు. దాదాపుగా భారతీయ వంటకాలలో ఎక్కువగా వాడుతారు. ఆహార రుచిని, వాసనను పెంచడానికి ఉపయోగిస్తారు. యాలకులు ఒక ఆయుర్వేద ఔషధమొక్క. దీని సాగుతో కొంతమంది రైతులు లక్షలు సంపాదిస్తున్నారు. మహారాష్ట్రలోని కొంకన్‌లో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు పండిస్తారు. అందులో యాలకులను ఎక్కువగా పండిస్తారు. అయితే యాలకుల సాగు నుంచి గరిష్ట దిగుబడి పొందాలంటే దానిని శాస్త్రీయంగా ఒక పద్దతి ప్రకారం పండించడం అవసరం. అది ఎలాగో తెలుసుకుందాం.

వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం.. కనిష్ట ఉష్ణోగ్రత 10°C గరిష్టంగా 35°C ఉండే ప్రాంతాల్లో యాలకులు పండించవచ్చు. యాలకులు ఒక నీడ చెట్టు. ఈ కారణంగా కొబ్బరి, తమలపాకుల తోటలలో పెంచడం మంచిది. సూర్యకాంతి నేరుగా ఈ మొక్కపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తమలపాకును 3 x 3 మీటర్ల దూరంలో నాటితే ప్రతి రెండు చెట్ల మధ్య ఒక యాలకుల చెట్టును నాటవచ్చు.అయితే యాలకుల మొక్కలు నీటి ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేవు. అందువల్ల నేలలో క్రమం తప్పకుండా తేమ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నాలుగు రోజులకు ఒకసారి నీరు పెడితే సరిపోతుంది.

యాలకులను ఎప్పుడు కోయాలి వ్యవసాయ శాఖ ప్రకారం.. యాలకులు కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు ఆకుపచ్చ, పసుపు రంగులోకి మారుతాయి. అప్పుడు వాటిని చిన్న కత్తెరతో కట్ చేసి కొమ్మతో పాటు సేకరించాలి. 5 నుంచి 6 రోజుల వరకు ఆరబెట్టడం ముఖ్యం. అప్పుడప్పుడు వాటిని కదిలించుతూ ఉండాలి. ఇక ఈ మొక్క ప్రధానంగా శిలీంధ్ర వ్యాధుల బారిన పడుతుంది. వ్యాధి కనిపించిన వెంటనే పండ్లు, తీగలు కుళ్ళినట్లుగా కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని వారు సూచించిన మందును పిచికారీ చేయాలి.

FYI With Swathi Video: ప్రతి 2 గంటలకు ఒక చిన్నపిల్ల మీద రేప్ .. ఆపే ప్రయత్నం చేస్తున్నామా.?(వీడియో).

UGC NET 2021: త్వరలో UGC NET అడ్మిట్ కార్డ్ విడుదల.. తాజా అప్‌డేట్‌ ఏంటంటే..?

Kids Breakfast: వర్షం కురుస్తున్నప్పుడు ఇంట్లో ఈ స్నాక్స్‌ను ట్రై చేయండి.. ఎప్పుడు బయట ఫుడ్ ఆర్డర్ ఇవ్వరు..