Headache: ఎన్ని ట్యాబ్లెట్స్‌ వేసుకున్నా తలనొప్పి తగ్గడం లేదా.? ఇలా చేస్తే మటుమాయం

|

Jun 18, 2024 | 12:18 PM

తలనొప్పి.. సర్వసాధారణమైన సమస్య. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడే ఉంటాం. అయితే కాస్త తలనొప్పి రాగానే వెంటనే ఏదొ ఒక ట్యాబ్లెట్‌ వేసేస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో ఎన్ని ట్యాబ్లెట్స్‌ వేసినా ఫలితం ఉండుదు. ఒకవేళ డోస్‌కి మించిన ట్యాబ్లెట్స్‌ వేసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయనే భయం ఉంటుంది...

Headache: ఎన్ని ట్యాబ్లెట్స్‌ వేసుకున్నా తలనొప్పి తగ్గడం లేదా.? ఇలా చేస్తే మటుమాయం
dizziness
Follow us on

తలనొప్పి.. సర్వసాధారణమైన సమస్య. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడే ఉంటాం. అయితే కాస్త తలనొప్పి రాగానే వెంటనే ఏదొ ఒక ట్యాబ్లెట్‌ వేసేస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో ఎన్ని ట్యాబ్లెట్స్‌ వేసినా ఫలితం ఉండుదు. ఒకవేళ డోస్‌కి మించిన ట్యాబ్లెట్స్‌ వేసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయనే భయం ఉంటుంది. అందుకే తలనొప్పి వచ్చినప్పుడల్లా ట్యాబ్లెట్స్‌ వేసుకోకుండా కొన్ని రకాల సహజ చిట్కాలు పాటించినా తలనొప్పికి చెక్‌ పెట్టొచ్చని మీకు తెలుసా.? ఇంతకీ తలనొప్పిని సహజ పద్ధతుల్లో ఎలా చెక్‌ పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

* వెల్లుల్లి తలనొప్పి తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం కొద్దిగా వెల్లుల్లిని తీసుకొని నీటితో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. బాగా తలనొప్పిగా ఉన్న సమయంలో ఒక టీ స్పూన్‌ వెల్లుల్లి పేస్ట్‌ను తీసుకుంటే వెంటనే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* నిమ్మరసం కూడా తలనొప్పిని తరిమికొట్టడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగితే తనొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

* నొప్పుల నుంచి ఉపశమనం కల్పించడంలో అల్లం ఉపయోగపడుతుందని తెలిసిందే. వేడి వేడి టీలో ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని తాగితే దెబ్బకు తలనొప్పి పరార్‌ కావాల్సిందే. లేదంటారా చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకున్నా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంటే యూకలిప్టస్‌ ఆయిల్‌తో తలపై కాస్త మర్దన చేసుకోవాలి. ఇలా చేసుకున్నా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* ఒక ఎక్కువగా చీకటి, గాలి లేని గదిలో ఉన్నా కూడా తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గాలి, వెలుతురు దారాలంగా వచ్చే ప్రదేశంలో గడపాలి. తలనొప్పిగా ఉన్న సమయంలో కాసేపు అలా పార్కులో చల్లటి గాలిలో వాకింగ్‌ చేయండి మార్పు మీరే గమనిస్తారు.

* ఒక విపరీతమైన తలనొప్పి వేధిస్తుంటే తలకు కొబ్బరి నూనెతో మసాజ్‌ చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. నూనెను కాస్త వేడి చేసుకొని అప్లై చేసుకుంటే మరీ మంచిది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..