Yoga Tips : ఒత్తిడి నుంచి బయటపడటానికి యోగా మంచి పరిష్కారం. అయితే గంటల తరబడి చేయనవసరం లేదు. కేవలం కొన్ని నిమిషాలు కేటాయించడం ద్వారా మంచి ఉపశమనం దొరుకుతుంది. మీ జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు. యోగా గొప్పతనం ఏంటంటే మీ శ్వాసలో మార్పు తీసుకురావడమే. మీ శ్వాస వేగం, నాణ్యతను పెంచడం ద్వారా మీరు నాడీ వ్యవస్థను శాంతపరచవచ్చు. తద్వారా మీ శరీరాన్ని ఒత్తిడి స్థితి నుంచి విముక్తి కలిగించవచ్చు. అలాంటి మూడు సాధారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం.
1. పామింగ్ టెక్నిక్‌తో ప్రారంభించండి
కంటి అలసట, ఎక్కువ గంటలు స్క్రీన్‌ను చూడకుండా ఉండేందుకు పామింగ్ ఉపయోగపడుతుంది. కొంచెం వేడికోసం మీ అరచేతులను రెండింటిని కలిపి రుద్ది ఆపై మీ చేతులను కళ్లపై పెట్టుకోండి. ముఖ్యంగా కనుబొమ్మలు, నుదిటిపై దృష్టి పెట్టండి. తర్వాత కొన్ని సెకన్లు గట్టిగా శ్వాస తీసుకోండి.
2. కొంత లోతైన శ్వాస తీసుకోండి..
మీరు ఉద్వేగానికి లోనైనప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు లేదా శారీరకంగా అలసిపోయినప్పుడు శ్వాస తీసుకునే ప్రక్రియ బలహీనమవుతుంది. అప్పుడు బలంగా శ్వాస తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మానసిక ఒత్తిడికి గురవుతాం. లోతైన శ్వాస లేదా డయాఫ్రాగ్మాటిక్ మీకు ఈ సందర్భంలో అవసరమైన టెక్నిక్. ఎప్పుడైనా ఖాళీ కడుపులో దీన్ని చేయవచ్చు. లోతుగా శ్వాస తీసకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.
3. కొద్ది సేపు ధ్యానం..
యోగాలో కొంత లోతైన శ్వాస తరువాత మనస్సు సహజంగా ప్రశాంత స్థితికి వస్తుంది. తర్వాత ధ్యానం చేస్తే మనసు నిచ్చలంగా ఉంటుంది. కనీసం 3 నిమిషాల పాటు ధ్యానం కొనసాగించండి. ఉదాహరణకు, మీరు శ్వాసను ధ్యాన వస్తువుగా ఎంచుకుంటే ఐదుసార్లు నెమ్మదిగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా పలుసార్లు పునరావృతం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఈ విధంగా మీ దైనందిన జీవితంలో యోగాను అభ్యసించవచ్చు. ఈ పద్ధతులు సరళమైనవి, పరికరాలు అవసరం లేదు. ఎక్కడైనా చేయవచ్చు. కానీ చాలా శక్తివంతమైనవి కొన్ని వారాల ప్రాక్టీసులో చాలా తేడాను గమనిస్తారు.