
చికెన్ ,మటన్ తరహాలో మనకు డేలీ చేపలు దొరకాలంటే చాలా కష్టం. ఎందుకంటే వీటి లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి, కేవలం వారంలో ఒక్కరోజు మాత్రమే ఇవి మార్కెట్‌లొ కనిపిస్తాయి. అందుకే చాలా మంది ఒకేసారి వాటిని తెచ్చి ప్రజ్‌లో స్టోర్ చేసుకుంటారు. అయితే చాలా మందికి ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి. చేపలు ఎన్ని రోజులు ప్రిజ్‌లో ఉంచడం మంచింది. ఎక్కువ రోజులు ఉంచితే ఏమవుతుందని. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

అయితే చేపల రకాన్ని బట్టి ప్రిజ్‌లో ఎన్ని రోజులు నిల్వ చేయాలి అనేది ఆదారపడి ఉంటుంది. అవును సార్డినెస్, తిలాపియా వంటి చేపలను ఫ్రీజర్‌లో ఆరు నుండి ఎనిమిది నెలల వరకు నిల్వ చేయవచ్చు. అదే సాల్మన్, మాకెరెల్, ట్రౌట్ వంటి కొవ్వు ఎక్కువగా ఉండే చేపలను ఫ్రీజర్‌లో రెండు నుండి మూడు నెలల వరకు నిల్వ చేయవచ్చు.

అలాగే చేపలను ఏ ఉష్ణోగ్రత వద్ద ప్రిజ్‌లో పెడుతున్నామన్నది కూడా చాలా ముఖ్యం. చేప ఏదైనప్పటికీ, ఫ్రీజర్‌లోని ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి. దానిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. దానిని ప్లాస్టిక్ లేదా అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి ఫ్రీజర్‌లో నిల్వ చేయడం మంచిది.

మీరు చేపను కొన్న తర్వాత దానిని ఎక్కువసేపు బయట ఉంచకూడదు. వీలైనంత త్వరగా ఫ్రీజర్‌లో పెట్టాలి. అదే సమయంలో చేపలు కొనేప్పుడు కూడా మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ తాజాగా కనిపించే చేపలను మాత్రమే కొనుగోలు చేయాలి.

తాజా చేపలను ఎలా గుర్తించాలంటే.. తాజా చేపల కళ్ళు మెరుస్తూ, పైకి ఉబ్బినట్లు ఉంటాయి. పాత చేపల కళ్ళు లోపలికి పోయి, మసకగా ఉంటాయి. చేపల మొప్పలను తెరిచి చూస్తే అవి మంచి ఎరుపు రంగులో ఉండాలి. చేపను తోక భాగం పట్టుకుని పైకి లేపితే అది వంగకుండా నిటారుగా నిలబడాలి. చేప శరీరాన్ని వేలితో నొక్కినప్పుడు, ఆ నొక్కిన భాగం వెంటనే సాధారణ స్థితికి వచ్చేయాలి. అలా కాకుండా అక్కడ గుంత పడితే అది తాజా చేప కాదని అర్థం కాబట్టి కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి.