Summer Trip: తక్కువ బడ్జెట్ లో ఇష్టమైన ప్రదేశాలను చూడాలనుకుంటున్నారా.. అయితే ఈ ట్రిప్స్ ప్లాన్ చేసుకోండి

|

Apr 15, 2024 | 12:22 PM

సమ్మర్ సీజన్ లో పిల్లలు తమ తల్లిదండ్రులు ఏదైనా వెకేషన్ కు వెళ్దామని అల్లరి చేయడం సహజం. కానీ తల్లిదండ్రులు తమ పనిలో బిజీగా ఉంటూ ట్రిప్ ప్లాన్ చేయరు. అయితే బడ్జెట్ లేకపోవడంతో చాలా సార్లు ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకుంటారు. అయితే చాలా తక్కువ మొత్తం ఇష్టమైన ప్రదేశాలను చుట్టి రావచ్చు. అవేంటో తెలుసా

Summer Trip: తక్కువ బడ్జెట్ లో ఇష్టమైన ప్రదేశాలను చూడాలనుకుంటున్నారా.. అయితే ఈ ట్రిప్స్ ప్లాన్ చేసుకోండి
Kerala
Follow us on

సమ్మర్ సీజన్ లో పిల్లలు తమ తల్లిదండ్రులు ఏదైనా వెకేషన్ కు వెళ్దామని అల్లరి చేయడం సహజం. కానీ తల్లిదండ్రులు తమ పనిలో బిజీగా ఉంటూ ట్రిప్ ప్లాన్ చేయరు. అయితే బడ్జెట్ లేకపోవడంతో చాలా సార్లు ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకుంటారు. అయితే చాలా తక్కువ మొత్తం ఇష్టమైన ప్రదేశాలను చుట్టి రావచ్చు. అవేంటో తెలుసా

మౌంట్ అబూ

రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ అబూ, పిల్లలతో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఇది ఒకటి. సరస్సు, గురు శిఖర్, టోడ్ రాక్ వ్యూ పాయింట్, దిల్వారా జైన్ టెంపుల్ వంటి అనేక టూరిస్టు ప్రాంతాలున్నాయి. అయితే మీరు ఈ ట్రిప్ ను ప్లాను చేసుకుంటే రైలులో ప్రయాణం బెస్ట్. మౌంట్ అబూకి సమీప రైల్వే స్టేషన్ అబూ రోడ్ రైల్వే స్టేషన్ ఉంది.

హరిద్వార్, రిషికేశ్

పిల్లలను తీసుకెళ్లడానికి హరిద్వార్, రిషికేశ్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ ప్రదేశం భారతదేశంలోని బెస్ట్ సమ్మర్ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. రైల్వే స్టేషన్ హరిద్వార్ జంక్షన్ ద్వారా అక్కడికి చేరుకోవచ్చు. రైలు ప్రయాణంలో ఎక్కువ ఖర్చు ఉండదు.

మహాబలేశ్వర్

ముంబైలోని ఈ ప్రదేశం కుటుంబ సమేతంగా సందర్శించడానికి ఇది సరైన సమయం. మహారాష్ట్రలో వేసవిలో టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ హిల్ స్టేషన్ మీకు వేడి నుండి ఉపశమనం ఇస్తుంది. ఇక్కడ మీరు దేవాలయాలు, జలపాతాలు, ప్రతాప్‌గడ్ కోట ట్రెక్‌లను సందర్శించవచ్చు. మహాబలేశ్వర్‌కి సమీప రైల్వే స్టేషన్ వతార్ ఉంది. ఇది నగరం నుండి 60 కి.మీ దూరంలో ఉంది.

డల్హౌసీ

చాలా తక్కువ ఖర్చుతో ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించవచ్చు. డల్హౌసీ లో మంచి స్థలాలున్నాయి. ఇది మీ టూరును మరిచిపోలేకుండా చేస్తుంది. వేసవిలో సందర్శించడానికి బెస్ట్ ప్లేస్ ఇది.