Fatty liver alert: కాలేయం దెబ్బతింటే పాదాలలో ఈ సంకేతాలు.. విస్మరిస్తే ప్రాణాంతకం కావచ్చు
కాలేయం మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలోని అతిపెద్ద అవయవం. ఇది పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అనేక విధులను నిర్వహిస్తుంది. కాలేయంలో సమస్య ఉన్నప్పుడు.. దానిని గుర్తించేందుకు.. చికిత్సకు కీలకమైన ఇతర అవయవాల ద్వారా సంకేతాలను పంపుతుంది. వాటిని విస్మరిస్తే.. ప్రాణాంతకం కావచ్చు.

భారతదేశంలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ఒక అంటువ్యాధిగా వ్యాపిస్తోంది. జనాభాలో చాలా ఎక్కువ మంది ప్యాటీ లివర్ బారిన పడుతున్నారు. పేలవమైన ఆహారం , జీవనశైలి దీనికి ప్రధాన కారణాలు. కాలేయంలో తక్కువ మొత్తంలో కొవ్వు పేరుకుపోవడం సాధారణం.. అయితే అధిక మొత్తంలో కాలేయంలో కొవ్వు పేరుకుంటే.. కాలేయ పనితీరును దెబ్బతీస్తుంది.
ఫ్యాటీ లివర్‌లో రెండు రకాలు ఉన్నాయి:
అధికంగా మద్యపానం వలన వచ్చే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD).. ఇది ఊబకాయం, మధుమేహం, సరైన ఆహారం తినకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక రకాల జీవనశైలి కారకాలతో ముడిపడి ఉంటుంది. ఫ్యాటీ లివర్ వ్యాధి నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్, సిర్రోసిస్, లివర్ క్యాన్సర్‌గా కూడా అభివృద్ధి చెందుతుంది. రెండూ కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల వస్తాయి. అయితే కారణాలు, లక్షణాలు, చికిత్సలు భిన్నంగా ఉంటాయి.
ఫ్యాటీ లివర్ యొక్క ప్రారంభ సంకేతాలు తరచుగా కనిపించవు.. వ్యాధి పెరిగేకొద్దీ ఉదరం కుడి వైపున నొప్పి, ఒత్తిడి, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. తీవ్రమైన లక్షణాలలో కాళ్ళు , ఉదరంలో వాపు, కామెర్లు (చర్మం , కళ్ళు పసుపు రంగులోకి మారడం), ముదురు మూత్రం, లేత మలం, మానసిక గందరగోళం కూడా ఉండవచ్చు.
ఫ్యాటీ లివర్ ఈ లక్షణాన్ని విస్మరించవద్దు
UK ఆరోగ్య సంస్థ NHS ప్రకారం పాదాల వాపు కూడా ఫ్యాటీ లివర్‌కు సంకేతం. దీనిని సకాలంలో గుర్తించాలి.
పాదాలు ఉబ్బే పరిస్థితిని పెడల్ ఎడెమా అంటారు. ఎవరి పాదాలు అయినా ఉబ్బినట్లయితే.. అంటే ఎక్కువసేపు నిలబడటం, అతిగా నడవడం లేదా మరేదైనా కారణంగా సంభవిస్తుందని భావించి.. దానిని పట్టించుకోకుండా కొట్టిపారేయకూడదు.
ఈ పరిస్థితిని నిర్ధారించడానికి పాదాల వాపు ఉన్న చర్మంపై కొన్ని సెకన్ల పాటు గట్టిగా నొక్కి ఉంచండి. మీ వేలును తొలగించిన తర్వాత అక్కడ ఏర్పడిన కుంగుబాటు చాలా కాలం పాటు కొనసాగితే.. అది పిట్టింగ్ ఎడెమాకు సంకేతం. ఇది శరీరంలో నీరు నిలుపుదల వల్ల వస్తుంది. పెడల్ ఎడెమా అంటే పాదాలు.. చీలమండలలో ద్రవంతో నిండిన వాపు. అయితే పిట్టింగ్ ఎడెమా అంటే ఒత్తిడిని ప్రయోగించిన తర్వాత కూడా కొనసాగే వాపు.
లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స పొందండి
పెడల్ ఎడెమా (కాళ్ళలో వాపు) కాలేయం దెబ్బతింటుందని ముందస్తు హెచ్చరిక సంకేతం కావచ్చు. కనుక ఈ లక్షణాన్ని విస్మరించవద్దు. ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స చేయడం వల్ల మీ కాలేయం , మీ జీవితం రెండింటినీ కాపాడుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




