Weight Loss: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. జస్ట్ 3 నెలల్లోనే 8-10 కిలోల బరువు తగ్గవచ్చు!

Weight Loss Tips: ఈ మధ్య కాలంలో జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పెరిగిన ఒత్తిడి కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ఎక్కువ వరకు జనాలు ఫేస్ చేసే ప్రధాన సమస్య బరువు పెరగడం. ఈ సమస్యను అదిగమించేందుకు చాలా మంది జిమ్‌కు వెళ్తూ వర్కౌట్స్ చేస్తూ కష్టపడుతారు. అయితే బరువు తగ్గాలనుకునే వారికి రషీద్ అనే ఫిట్‌నెస్ ట్రైనర్ కొన్ని మంచి చిట్కాలను చెప్పారు. వాటిని మీరు రోజువారి జీవనశైలిలో భాగం చేసుకుంటే కేవలం 3 నెలల్లోనే 5-10 కేజీల బరువు ఈజీగా తగ్గవచ్చని ఆయన అంటున్నారు. ఆదెలానో తెలుసుకుందాం.

Weight Loss: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. జస్ట్ 3 నెలల్లోనే 8-10 కిలోల బరువు తగ్గవచ్చు!
Weight Loss Tips (1)

Updated on: Jan 18, 2026 | 7:28 PM

రషీద్ అనే ఫిట్‌నెస్ ట్రైనర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ప్రకారం.. బరువు తగ్గడం అనేది అదృష్టం వల్ల జరిగే విషయం కాదని ఆయన అంటున్నారు. ఇందుకోసం సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, ప్రతిరోజూ చిన్న, సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా ఎవరైనా మూడు నెలల్లో 20 కిలోగ్రాముల వరకు బరువు తగ్గవచ్చని ఆయన చెబుతున్నారు. కాబట్టి తక్కువ సమయంలో మెరుగైన ఫలితాలను ఇచ్చే కొన్ని సాధారణ వ్యూహాలను ఆయన ఇన్‌స్టావేదికగా పంచుకున్నారు.

బరువు తగ్గేందుకు పాటించాల్సి కొన్ని అలవాట్లు( చిట్కాలు)

చక్కెర పానీయాలను నివారించండి: మీరు బరువు తగ్గాలనుకుంటే, ముందుగా సోడా, తీపి జ్యూస్‌లు, మాల్ట్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి చక్కెర పానీయాలను తీసుకోవడం ఆపేయండి. ఎందుకంటే వీటిలో అదనపు కేలరీలు ఉంటాయి, ఇవి బరువు పెరగడానికి దారితీస్తాయి. వీటికి బదులుగా మీరు నీరు, గ్రీన్ టీ లేదా నిమ్మకాయ నీటిని మీ ఆహారంలో చేర్చుకోండి.ఇవి మీకు త్వరగా బరువు తగ్గేందుకు సహాయపడుతాయి.

మీ కార్బోహైడ్రేట్లను తగ్గించండి: మీరు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించేందకు ప్రయత్నించండి. బ్రెడ్‌, పేస్ట్రీలు, వేయించిన స్నాక్స్, రైస్‌ తక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు వేగంగా బరువు పెరుగుతారు. వీటికి బదులుగా మీ ఆహారంలో ప్రోటీన్, ఆకుపచ్చ కూరగాయలు, ఓట్స్ వంటి ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను చేర్చుకోండి .

రాత్రిపూట చిరుతిళ్లు తినడం మానుకోండి: రాత్రిపూట బిస్కెట్లు లేదా జ్యూస్‌లు తాగడం వల్ల పొట్టలో కొవ్వు పేరుకుపోతుంది. దీనిని వెంటనే తగ్గించండి. రాత్రి భోజనం చేసేందుకు ఒక నిర్ధిష్ట సమయాన్ని నిర్ధారించుకొని.. ప్రతి రోజు అదే సమయానికి భోజనం చేయండి. అలాగే భోజనం చేసిన తర్వాత మాత్రమే నీరు త్రాగడం అలవాటు చేసుకోండి. అంతేకాదు ఫుడ్‌ కూడా తగ్గువగా తీసుకోండి. ఎప్పుడూ ఫ్రెష్‌గా ఇంట్లో వండిన ఆహరం తినండి.

భోజనం తర్వాత వాక్ : భోజనం తర్వాత కొద్దిసేపు నడవండి, లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఉపయోగించండి, ప్రతిరోజూ దాదాపు 10,000 అడుగులు నడవడానికి ప్రయత్నించండి. ఇది క్రమంగా ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అలాగే వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి. వారానికి 2-3 రోజులు బల శిక్షణ చేయండి. ఇది శరీరాన్ని టోన్ చేయడానికి, కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.

జంక్ ఫుడ్ కు నో చెప్పండి: బిస్కెట్లు, స్వీట్లు, చిప్స్ వంటి జంక్ ఫుడ్స్ బరువు తగ్గడానికి అతిపెద్ద అడ్డంకులు. అందుకే వీటిని పూర్తిగా అవైడ్ చేయండి. వీటికి బదులుగా, పండ్లు, ఎండిన పండ్లు లేదా గ్రీకు పెరుగు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తినండి. అలాగే టైంకి నిద్రపోండి. సరైన నిద్ర లేకపోవడం వల్ల మీ ఆకలి పెరుగుతుంది. అప్పుడు మీరు ఎక్కువగా తింటారు. దీని వల్ల త్వరగా బరువు పెరుగుతారు. కాబట్టి డేయిలీ 7-8 గంటల నిద్రపోయేలా చూసుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.