Yoga Pose-Kati Chakrasana: పొట్ట దగ్గర అధిక కొవ్వు తగ్గాలా.. ఈ యోగాసనాన్ని ట్రై చేయండి

| Edited By: Surya Kala

Jul 12, 2021 | 3:12 PM

Kati Chakrasana: ఉరుకులు పరుగుల జీవితం.. కాలంతో పాటు పరుగులు పెడుతూ జీవించాల్సిన పరిష్టితులు. ఎంత సందించుకున్నా తిండి తినడానికి కూడా సమయం లేని ఉద్యోగాలు...

Yoga Pose-Kati Chakrasana: పొట్ట దగ్గర అధిక కొవ్వు తగ్గాలా.. ఈ యోగాసనాన్ని ట్రై చేయండి
Kati Chakrasana
Follow us on

Kati Chakrasana: ఉరుకులు పరుగుల జీవితం.. కాలంతో పాటు పరుగులు పెడుతూ జీవించాల్సిన పరిష్టితులు. ఎంత సందించుకున్నా తిండి తినడానికి కూడా సమయం లేని ఉద్యోగాలు. ఎమ్మెన్సీ ఉద్యోగాలతో నిద్రవేళల్లో మార్పులు.. దీంతో ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కనుక ప్రతి రోజు యోగాసనాలను ఒక 15 నిమిషాల పాటు అయినా క్రమం తప్పకుండా వేయాలి. దీంతో శారీరక, మానసిక ఆనందాన్ని ఇస్తాయి యోగాసనాలు. అనారోగ్యం, ఆందోళనలు దరిచేరనీయవు. శారీరక శ్రమ తగ్గి.. కూర్చుని చేసే ఉద్యోగాలు ఎక్కువైన ఈ రోజుల్లో ఊబకాయం, కీళ్ల నొప్పులు సర్వసాధారణం అయ్యిపోయాయి. ఈరోజు ఆర్థరైటీస్ నుంచి ఉపశమనం కలిగించే యోగాసనం గురించి తెలుసుకుందాం.

యోగాసనాల్లో ఒకటి కటి చక్రాసనం. కటి అంటే సంస్కృతంలో కృశోధరము. సాధారణ వాడుక భాషలో నడుము అని అంటారు. కటిని అంటే నడుము తిప్పే ఈ ఆసనాన్ని కటి చక్రాసనం అంటారు. దీని వలన శరీరానికి చాలా మేలు జరుగుతుంది.

కటి చక్రాసనం వేయు విధానం:

ముందుగా రెండుపాదాలు దగ్గరగా ఉంచి నిటారుగా నిల్చోవాలి. తర్వాత రెండు పాదాలను ఒక్కటిన్నర అడుగు దూరంగా ఉంచి రెండు చేతులను ముందుకు చాచాలి. చేతులు ఒకదానికొకటి సమాంతరంగా పెట్టాలి. అనంతరం గాలి దీర్ఘంగా పీల్చుకొని గాలి వదులుతూ కాళ్ళను కదల్చకుండా కుడిపక్కగా వీలున్నంతవరకూ తిరగాలి. నడుము వరకు మాత్రమే తిరగాలన్నమాట. వెనక్కి తిరిగినప్పుడు కూడా చేతులు ఒక్కదానికొకటి సమాంతరంగానే ఉంచాలి. నాలుగు నుంచి 6 సెకన్ల పాటు ఆగి గాలి పీల్చుకుంటూ ముందుకు తిరగాలి. ఇలా ఒకసారి కుడిపక్కగా మరోసారి ఎడమ పక్కకు ఇలా మొత్తం 5 నుంచి 10 సార్లు చేయాలి

ఉపయోగాలు :

శరీర ఊర్ధ్వ భాగానికిది మంచి వ్యాయామం.
నడుము దగ్గర కొవ్వును కరిగిస్తుంది.
ఆర్థ్రరైటిస్ ఉన్నవారికి చాలా మంచిది.

ఈ ఆసనం వేయు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

స్పాండిలైటిస్ ఉన్నవారు మెడ కొంచెం నెమ్మదిగా తిప్పాలి. భుజం, నడుమ నొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయకపోవడం మంచిది.

*అయితే ఎవరైనా సరే యోగాసనాలు వేయడానికి ముందు కొంచెం సేపు చిన్నపాటి వ్యాయామం తప్పని సరిగా చేయాలి.

Also Read: Beauty Tips for Men: మగవారి ముఖం దుమ్ము, ధూళి, టాన్‌తో పేరుకుని ఉందా.. ఈ సింపుల్ చిట్కాలను పాటించి చూడండి