Winter Diet: మెరిసే చర్మం కావాలా..? వింటర్ డైట్‌ను ఇలా ప్లాన్ చేసుకోండి..

|

Jan 19, 2022 | 1:34 PM

వాతావరణంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆహారంలో మార్పు అవసరం. కీళ్ల సమస్యలు, బరువు పెరగడం, విటమిన్ డి లోపం, మలబద్ధకం వంటివి చలికాలంలో..

Winter Diet: మెరిసే చర్మం కావాలా..? వింటర్ డైట్‌ను ఇలా ప్లాన్ చేసుకోండి..
Glowing Skin
Follow us on

వాతావరణంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆహారంలో మార్పు అవసరం. కీళ్ల సమస్యలు, బరువు పెరగడం, విటమిన్ డి లోపం, మలబద్ధకం వంటివి చలికాలంలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్యలు. చలికాలం వచ్చిందంటే చర్మం పొడిబారడంతోపాటు జుట్టు రాలడం కూడా ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడటమే కాకుండా ఆరోగ్యకరమైన బరువును, మెరిసే చర్మాన్ని, జుట్టు బలాన్ని కూడా అందిస్తాయి. ఇది చర్మాన్ని మృదువుగా మార్చడంలో.. ముడతలు రాకుండా చేయడంలో కూడా సహాయపడుతుంది . చలికాలంలో చర్మం పొడిబారుతుంది(Dry Skin). అటువంటి పరిస్థితిలో, ఏదైనా మాయిశ్చరైజర్ వాడినప్పటికీ, చర్మం పొడిగా ఉంటుంది. శీతాకాలంలో , ఆరోగ్యకరమైన, మృదువైన చర్మం కోసం మాయిశ్చరైజర్‌తో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని (Immunity) కూడా తీసుకోవాలి .

మన చర్మాన్ని హైడ్రేట్గా..

మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి నీరు చాలా ముఖ్యం. తగినంత నీరు తాగడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. ఇది చర్మం పొడిబారడం, ముడతలను తొలగించడంలో సహాయపడుతుంది. తక్కువ నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇది అలసటకు దారి తీయవచ్చు. మీరు వృద్ధాప్యంగా కనిపించవచ్చు.

కొవ్వు ఆమ్లాలు

వాల్‌నట్‌లు, అవిసె గింజలు, సాల్మన్ , మాకేరెల్ వంటి చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు చర్మాన్ని పోషణగా ఉంచడంలో సహాయపడతాయి. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ఇది చాలా ముఖ్యం.

కారెట్

క్యారెట్‌లో బీటా కెరోటిన్ , లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. ఇది UV దెబ్బతినకుండా చర్మాన్ని రక్షిస్తుంది. క్యారెట్‌లో విటమిన్ ఎ, పొటాషియం , యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి పొడి చర్మంతోపాటు పగిలిపోయాలే చేస్తుంది.

ఆమ్ల ఫలాలు

శీతాకాలంలో మీరు తాజా జ్యుసి పండ్లను తినవచ్చు. ఇందులో నారింజ, టాన్జేరిన్, ద్రాక్ష వంటి పండ్లు ఉన్నాయి. ఈ విటమిన్ సి-రిచ్ పండ్లు శీతాకాలంలో ఉత్తమ సూపర్ ఫుడ్స్ కావచ్చు. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, నీటి కంటెంట్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

చిలగడదుంప

చిలగడదుంప ముఖ్యంగా శీతాకాలంలో ఇష్టపడతారు. స్వీట్ పొటాటోలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. చిలగడదుంపలలో ఉండే అధిక స్థాయి బీటా కెరోటిన్ చర్మానికి పోషణను అందించడమే కాకుండా చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి.. సాధారణ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి: Tongue Color: గుండెపోటును మన నాలుక రంగుతో తెలుసుకోవచ్చు.. ఎలా గుర్తించాలంటే..?

Parenting Tips: మీ చిన్నారులు స్మార్ట్ ఫోన్‌తోనే ఉంటున్నారా.. అయితే డేంజర్ జోన్‌లోనే ఉన్నట్టే.. మరిన్ని వివరాలు..