Holi 2021: హోలీ సంబరాలు.. అబ్బాయిల కోసం కొన్ని డ్రెస్సింగ్ ఐడియాస్.. మీరు తెలుసుకోండి..

|

Mar 26, 2021 | 8:18 PM

Holi 2021: హోలీ అంటే.. జీవితానికి ఉత్సహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చే రంగుల పండుగ.. ప్రతి ఒక్కరు తమ జీవితంలోని బాధలను మరచిపోయి.. స్నేహితులు,

Holi 2021: హోలీ సంబరాలు.. అబ్బాయిల కోసం కొన్ని డ్రెస్సింగ్ ఐడియాస్.. మీరు తెలుసుకోండి..
Holi Dressing Ideas For Men
Follow us on

Holi 2021: హోలీ అంటే.. జీవితానికి ఉత్సహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చే రంగుల పండుగ.. ప్రతి ఒక్కరు తమ జీవితంలోని బాధలను మరచిపోయి.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా రంగులు వేదజల్లుతూ.. ఆనందంగా గడిపెస్తుంటారు. ఇక హోలీ పండగ వచ్చిందంటే.. చాలా ఆ రోజున ఏమేం చేయాలి.. ఎలాంటి డ్రెస్ ధరించాలని అని ఆలోచిస్తుంటారు. అయితే ఈ వేడుకలలో కేవలం అమ్మాయిల కంటే ఎక్కువగా అబ్బాయిలు ఎంతో ఉత్సహాంగా పాల్గొంటారు. ఈ హోలీ వేడుకలలో మీరు మరింత అందంగా కనిపించేందుకు కొన్ని రకాల డ్రెస్సింగ్ ఐడియాస్ మీకోసం..

ఈసారి హోలీ సంబరాల్లో ఎలాంటి స్టైలీష్ ట్రెండ్స్‏ ఎంచుకోకుండా.. సంప్రదాయపు దుస్తులను ధరించడం వలన మరింత అందంగా కనిపిస్తారు. అందుకోసం మీరు కుర్తా పైజామా ఎంచుకోవడం ఉత్తమం. ఇవి మిమ్మల్ని సంప్రదాయబద్దంగా కనిపించేలా చేయడమే కాకుండా.. మర్యాదలు అందుకునేల చేస్తాయి. అందులో ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందామా.

Holi Festival

ఈ హోలీ పండగ వేళ మీరు వెనిలా వైట్, స్నో వైట్, పెర్ల్ వైట్, ఫ్రాస్ట్ వైట్ వంటి విభిన్న రకాల కుర్తాలను.. అందులోనూ ఎంబ్రయిడరీ కుర్తాలను ధరించడం వలన మరింత హైఫైగా కనిపిస్తారు. అలాగే పాంటోన్ కలర్, గ్రే కలర్, పసుపు రంగులలో కుర్తాలను ఎంచుకోవడం ఉత్తమం. అలాగే వైట్ కుర్తాలపై విభిన్న రంగుల కోట్స్ ధరించడం వలన రాయల్ లుక్‏లో కనిపిస్తారు. అందుకోసం మీరు ధరించే కుర్తా మీదికి క్లాసిక్ జాకెట్ లేదా డార్క్ జాకెట్స్ ధరించడం వలన మరింత అందంగా కనిపిస్తారు. ఇక మీ హైట్, పర్సనాలిటీకి అనుగుణంగా ప్రింట్స్ ఉండే పైజామాలు ఎంచుకోవడం ఉత్తమం. ఇక కుర్తాలలో ఎక్కువగా ఎ లైన్ కుర్తాలను ఎంచుకోవడం మంచిది. అలాగే కొద్దిగా ఆఫ్ రోడ్ స్టైలింగ్ ఫ్యాషన్ కుర్తాలను ఎంచుకోవడం వలన స్టైలీష్ గా కనిపిస్తారు. వీటికి దోతీ పైజామాలు ధరించడం వలన మీ లుక్కే మారిపోతుంది. ఇలాంటి దుస్తులను ధరించడం వలన మీరు ఈ సారి జరిగే హోలీ వేడుకలలో విభిన్నంగా డిఫరెంట్ లుక్కులో కనిపిస్తారు. మరీ మీరు ఈసారి ఇలాంటి డిఫరెంట్ లుక్ ట్రై చేయండి.

Also Read:

Holi 2021: హోలీ రంగుల నుంచి మీ గోళ్ళను ఈ విధంగా కాపాడుకోండి.. ఈ టిప్స్ ఫాలో అయితే మీ నెయిల్స్ భద్రమే..