Simha Kriya Benefits: కరోనా కోరల్లో నుంచి బయటపడానికి శ్వాస పక్రియ మెరుగుపరుచుకోవడానికి మేలు చేసే సింహ ప్రకియ..

|

Jun 02, 2021 | 5:32 PM

Simha Kriya Benefits:  కరోనా వైరస్ మహమ్మారి ముఖ్యంగా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని దిగజారాస్తూ.. మనిషిని మృత్యుముఖంలోకి తీసుకెళ్తోంది. అయితే లంగ్స్ యొక్క సామర్ధ్యాన్ని,...

Simha Kriya Benefits: కరోనా కోరల్లో నుంచి బయటపడానికి శ్వాస పక్రియ మెరుగుపరుచుకోవడానికి మేలు చేసే సింహ ప్రకియ..
Simha Yoga
Follow us on

Simha Kriya Benefits:  కరోనా వైరస్ మహమ్మారి ముఖ్యంగా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని దిగజారాస్తూ.. మనిషిని మృత్యుముఖంలోకి తీసుకెళ్తోంది. అయితే లంగ్స్ యొక్క సామర్ధ్యాన్ని, పనితీరుని మెరుగు పరచుకుంటే.. ఈ కరోనా కోరల్లో చిక్కుకున్నా సమస్యనుంచి బయటపడవచ్చు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ లంగ్స్ అంటున్నాం కానీ నిజానికి మనిషి వయవాలు పూర్తి సామర్థ్యం మేరకు పని చేయడానికి సరిపడా ఆక్సిజన్ ను మనం రోజూ శ్వాసద్వారా తీసుకుంటాం. ఇది మన ప్రమేయం లేకుండా జరిగే నిరంతర ప్రక్రియ. అయితే మనం మన శ్వాసక్రియను నిర్లక్ష్యం చేస్తున్నాం.. లంగ్స్ పనితీరుని మెరుగు పరిచి శ్వాస ను అందించేందుకు తోడ్పడేదే సింహ క్రియ. ఈరోజు ఈ యోగాసనాన్ని ఎలా చేయాలి అనేవిషయం తెలుసుకుందాం..!

* చేయాల్సిన పధ్ధతి: 

1. మొదట పద్మాసనంలో కూర్చోవాలి.

2. అనంతరం రెండు చేతులతో మోకాళ్లను నెడుతున్నట్టుగా వాటి మీద ఆనించి ఉంచాలి.

3. తర్వాత నోరు తెరచి, నాలుకను వీలైనంత బయటకు చాపి నోటి ద్వారా గాలిని బలంగా పీల్చి వదలాలి. ఈ సమయంలో ఉచ్ఛ్వాసనిశ్వాసాలు బలంగా, వేగంగా ఉండాలి. ఇలా 21 సార్లు చేయాలి.

4. తర్వాత నాలుకను అంగిలి వైపు మడిచి, నోటిని తెరచి ఉంచి, గాలిని బయటకు లోపలికి 21 సార్లు తీసుకోవాలి.

5. ఈ ప్రక్రియను సింహ క్రియ అంటారు. ఇలా నాలుకను చాపి, మడిచి గాలి పీల్చి వదిలేటప్పుడు నోటి వెంట శబ్దం రావాలి.

6. ఈ ప్రక్రియ మొత్తంలో కళ్లను మూసి ఉంచాలి. పొట్టను కదల్చకూడదు.

7. ఇలా కనీసం నిమిషం పాటు ఉండాలి.. అంతసేపు చేయాలనివారు ఆరనిమిషమైనా ఒకే.

8. ఇలా నిలిపి ఉంచిన గాలిని ముక్కు ద్వారా బయటకు వదలాలి.

9. ఈ సాధన చేసే సమయంలో పొట్ట ఖాళీగా ఉంటె మంచి ఫలితం దక్కుతుంది.

10. సింహ క్రియను రోజులో రెండు సార్లు సాధన చేయగలిగితే ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Also Read: రెండో పెళ్లి, క్యాన్సర్ వ్యాధి వార్తలపై స్పందించిన కన్నడ సోయగం ప్రేమ