Relationship: బంధం బలపడానికి, మీ భార్య ఒత్తిడిని తగ్గించడానికి.. భర్త ఈ సింపుల్ చిట్కాలను పాటించండి

Husband and Wife Relationship: ఇంటిని చూసి .. ఇల్లాలిని చూడు అన్నారు పెద్దలు. ఎంత పెద్ద చదువులు చదివినా, ఉద్యోగం చేస్తున్నా.. ఇల్లాలుగా మహిళలు.. కొన్ని బాధ్యతలు నిర్వహించాల్సిందే. ఒకొక్కసారి ఇంటి పనులు చాలా..

Relationship: బంధం బలపడానికి, మీ భార్య ఒత్తిడిని తగ్గించడానికి.. భర్త ఈ సింపుల్ చిట్కాలను పాటించండి
Husband And Wife Relationsh

Updated on: Apr 21, 2022 | 10:18 AM

Husband and Wife Relationship: ఇంటిని చూసి .. ఇల్లాలిని చూడు అన్నారు పెద్దలు. ఎంత పెద్ద చదువులు చదివినా,  ఉద్యోగం చేస్తున్నా.. ఇల్లాలుగా మహిళలు.. కొన్ని బాధ్యతలు నిర్వహించాల్సిందే. ఒకొక్కసారి ఇంటి పనులు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి ఒత్తిడికి గురిచేస్తాయి. చాలా సందర్భాలలో.. ఉద్యోగం చేస్తున్నా ఇంటి పనులను స్త్రీ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో బట్టలు ఉతకడం, పిల్లల సంరక్షణ, ఇల్లు శుభ్రం చేయడం, ఇతర పనులు ఉన్నాయి. తల్లిదండ్రులు అయిన తర్వాత దంపతుల బాధ్యతలు రెట్టింపు అవుతాయి. కొన్ని సందర్భాల్లో.. భార్య, భర్తల్లో ఎవరొకరు అధిక పని చేయాల్సి వస్తుంది. దీంతో అలసిపోతారు. పని ఒత్తిడి పురుషులనైనా లేదా  స్త్రీలనైనా ఎంతగానో బాధపెడుతుంది. సమయం కూడా ఒకొక్కసారి సరిపోదు అనిపిస్తుంది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు కూడా మొదలవుతాయి. ఈ గొడవల వల్ల దంపతుల మధ్య దూరం పెరిగే పరిస్థితులు ఏర్పడతాయి. ఒకే ఇంట్లో కలిసి ఉన్నా కూడా కలిసి ఉండరు. మీరు మీ భార్యాభర్తల సంబంధాన్ని సరిగ్గా ఉండాలని కోరుకుంటే.. ఒకరికొకరు అండగా నిలబడుతూ.. ఇంటి పనులలో భాగం పంచుకోవాలి. మీ భాగస్వామి ఒత్తిడిని తగ్గించే కొన్ని చిట్కాలు మీ కోసం..

  1. వంటగదిలో సహాయం: ఇంటి పనుల్లో కొద్దిగా సహాయం చేయడం ద్వారా, మీరు మీ భాగస్వామిని రిలాక్స్‌ చేయవచ్చు. వంటగది నుండి సహాయం చేయడం ప్రారంభించండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పని ఉంటే, అది తలనొప్పికి దారితీస్తుంది. కూరగాయలు కత్తిరించడం, కూరగాయలు కడగడం, పండ్లు కడగడం, ఫ్రిజ్‌లో కూరగాయలు సర్దడం వంటి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా మీరు మీ భాగస్వామికి సహాయం చేయవచ్చు. అంతేకాదు.. ఖాళీ అయిన డబ్బాల్లో ఆహార దినుసులు నింపడం వంటి పనులు కూడా మీ భార్య పని భారాన్ని తగ్గిస్తుంది. ఈ పనులు చిన్నవే కావచ్చు. వీటిని చేయడం వలన మీ భార్య పనిభారం తగ్గుతుంది. మీ రిలేషన్ షిప్ పెరుగుతుంది.
  2. ఇంటిని శుభ్రపరిచే విషయంలో: ఇంటిని అందంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్క స్త్రీ కోరుకుంటుంది. అయితే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత అలసిపోతుంది.  అందుకని శుభ్ర పరిచే సమయంలో కూడా చిన్న చిన్న పనులు చేయడం ద్వారా మీ భార్యకు సహాయం చేయవచ్చు. మీకు వంట చేయడం తెలియకపోయినా, శుభ్రత చేయడానికి పెద్దగా నైపుణ్యం అవసరం లేదు. కనుక జీవిత భాగస్వామికి ఇంటిని శుభ్రపరిచే సమయంలో సహాయం చేయవచ్చు. బెడ్ రూమ్ లో మంచం సరిచేయడం లేదా కిటికీ కర్టెన్స్ శుభ్రపరచడం వంటి పనులు చేయవచ్చు.
  3. పిల్లల సంరక్షణ: మీరు ఇంటి పనులలో సహాయం చేయలేని వారు.. పిల్లల విషయంలో కేరింగ్ తీసుకోవచ్చు. మీ భార్య  ఇంటి పనులను చేస్తున్న సమయంలో మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీ పిల్లలు కొంచెం పెద్దవారైతే ఇంటి పనుల్లో పిల్లల సహాయం తీసుకోవచ్చు.

Also Read: Wonder Kid: ఏడాదిన్నర వయసులో 400 వస్తువులు పేర్లు చెప్పే వండర్ కిడ్.. సూపర్‌ రికార్డ్‌