Natural Beauty Tips: ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే.. మొటిమలు, మచ్చలు లేని అందమైన ముఖ వర్చస్సు మీ సొంతం.

|

Jun 23, 2021 | 5:43 PM

Natural Beauty Tips: అందమైన ముఖ వర్చస్సు కోరుకొని అతివ ఉండదు.. .. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే ఇంట్లో ఉన్న సహజ పదార్ధాలతోనే ముఖ వర్చస్సుని...

Natural Beauty Tips: ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే.. మొటిమలు, మచ్చలు లేని అందమైన ముఖ వర్చస్సు మీ సొంతం.
Beauty Tips
Follow us on

Natural Beauty Tips: అందమైన ముఖ వర్చస్సు కోరుకొని అతివ ఉండదు.. .. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే ఇంట్లో ఉన్న సహజ పదార్ధాలతోనే ముఖ వర్చస్సుని మెరుగుపరచుకోవచ్చు. ముఖ్యంగా టమాటో చర్మానికి స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది. రోజూ సింపుల్ చిట్కాలను ఫాలో అయితే . నిగనిగలాడే ముఖ వర్చస్సు మీ సొంతం అవుతుంది. టమాటో తో రోజూ ఇలా చేస్తే ఎలాంటి మొటిమలు, మచ్చలు లేని అందమైన ముఖ వర్చస్సు మీ సొంతం.. మరి ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందామా..

*టొమాటో రసం, తేనె సమపాళ్లల్లో రంగరించి జిగురుగా ఉండే ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి . పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం కొత్త కళ సంతరించుకుంటుంది.

*క్యారెట్ ను ఉడికించి గుజ్జు చేసి.. దానిలో కొంచెం పచ్చి పాలు, తేనే కలిపి ఆ మిశ్రమాన్ని ముఖ్యానికి చేతులకు రాసుకుంటే.. టాన్ పోయి కొత్తకళను సంతరించుకుంటారు.

*కొంచెం ముల్తానీ మట్టి , టొమాటో గుజ్జు , పెరుగు , దోసకాయ రసం సమపాళ్లలో కలిపి రాసుకోండి. 20 నిమిషాల తర్వాత కడుక్కోండి . వారానికి రెండు సార్లు ఇలా చేస్తే ముఖం నిగనిగ మెరుస్తుంది.

*ముఖచర్మం జిడ్డుగా ఉంటే టొమాటో గుజ్జును రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడుక్కోండి .

* పొడి చర్మం గలవారు టొమాటో గుజ్జుకు పెరుగు కలిపి రాసుకుని గోరు వెచ్చటి నీతితో శుభ్రం చేసుకోవాలి.

* ఎండవేడికి చర్మ కమిలినప్పుడు టొమాటో , దోస రసాలను సమపాళ్లలో కలిపి రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. చర్మం నిగనిలాడుతుంది.

* ముఖం మీద మచ్చలు ఉంటే టొమాటో ముక్కతో పదిహేను నిముషాలు మృదువుగా రుద్దండి.ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయండి. రోజు ఇలా చేస్తే త్వరలోనే ఫలితం కనిపిస్తుంది.

చాలామందికి టమాటో ముఖానికి రాసుకున్నప్పుడు కొంచెం దురదవంటి ఫీలింగ్ ఉంటుంది. అది సహజమే.. అయితే ఆ ఫీలింగ్ అధికంగా ఉంటె.. వెంటనే ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుని పెరుగు రాసుకుంటే రిలీఫ్ ఇస్తుంది.

Also Read: కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం మొదటి హీరో ఎంట్రీ.. టైటిల్ టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు

అన్నం వండిన తర్వాత గంజిని పడేస్తున్నారా.. అది తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా