Mouth Ulcers: నోటిపూతతో బాధపడుతున్నారా..? నివారణకు అద్భుతమైన చిట్కాలు..

Mouth Ulcers: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య నోటి పూత. ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకునే వారిలో నోటిపూత సమస్య అధికమవుతుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం...

Mouth Ulcers: నోటిపూతతో బాధపడుతున్నారా..? నివారణకు అద్భుతమైన చిట్కాలు..
Mouth Ulcers

Updated on: Apr 04, 2021 | 5:55 PM

Mouth Ulcers: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య నోటి పూత. ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకునే వారిలో నోటిపూత సమస్య అధికమవుతుంది.
జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన నోటిపూత సమస్య కూడా ఎక్కువైపోతోంది. నోటిపూత వచ్చినప్పుడు తెల్ల తెల్లగా మచ్చలుగా కనిపిస్తూ ఉంటుంది అది కాస్తా నొప్పిని కలిగిస్తుంటాయి. ఇది శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధి. కొంత మంది నోటిపూత తగ్గడానికి మెడిసిన్స్ ను ఆశ్రయిస్తుంటారు. అయితే నోటిపూత అసలు రాకుండా ఏమి చర్యలు తీసుకోవాలి… నివారణకు ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కాలు ఏమిటో చూద్దాం..!

చిట్కాలు: 

1.ప్రతి రోజు ఉదయం పరకడుపున ఉప్పు కలపిన నీటిని నోట్లో వేసుకుని పుక్కలించండి.
2. నల్ల నువ్వులను దంచి ఉండలా చేసుకుని నోట్లో పెట్టుకుని రసం పీల్చి పిప్పిని ఉమ్మేయండి.
3. బియ్యం కడిగిన నీటిలో చెంచా ఉసిరి రసం కలుపుకుని భోజనానికి ముందు సేవించండి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1.నోటిని పరిశుభ్రతగా వుంచాలి. చిగుళ్ళ వ్యాధికి తగు చికిత్స చేయించాలి.
2.ప్రతి రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి.
3. మలబద్దకం లేకుండా చూసుకోవాలి.
4.జీర్ణాశయప్రక్రియ సరిగ్గా ఉండేలా ఆహారం తీసుకోవాలి.
5.ధూమపానం, మద్యపానం మానాలి.
6. కిళ్లీ, జర్దా, పాన్‌ పరాగ్‌ అలవాట్లను వదిలెయ్యాలి.

Also Read: ప్రపంచంలోనే అతి పెద్ద గుడ్డు.. ఈ గుడ్డు 15 మంది వరకూ ఫుడ్డు.. ఎన్ని పోషకాలుంటాయో తెలుసా..!
Toothbrush: మీరు వాడే టూత్ బ్రష్ ను ఎక్కువ రోజులు వాడితే ఏమౌతుందో తెలుసా..! ఎన్ని నెలకు మార్చాలంటే..!