Home Remedies For Hair Growth: మహిళలు జట్టు అందాన్ని ఇస్తుంది. అందుకే జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందంగానే ఉందంటారు. అయితే ప్రస్తుత కాలంలో జీవితం కోసం జీతం కోసం కాలంతో పోటీపడుతూ.. పరుగులు పెడుతున్నారు. సమయం సరిపోవడం లేదంటూ జుట్టుని షాంపులతో వాష్ చేసుకుంటున్నారు. ఇక వాతావరణ కాలుష్యం కూడా జుట్టు ఊడిపోవడానికి ఓ కారణంగా మారింది. జుట్టు రాలడం అనే సమస్యతో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మంచి ఆహారం తీసుకోవాలి. ఇక ఒత్తైన జుట్టు పెరగడానికి వంటింట్లో చిట్కాలు మంచి ప్రయోజనకారి
అలోవేరా జెల్
ఈ – విటమిన్ కాప్సిల్స్
కొబ్బరి నూనె
ఆముదం
అలోవెరా జెల్‌ని తీసుకుని జుట్టుకి పట్టించి నెమ్మదిగా ఓ అయిదు నిమిషాలపాటు మర్దనా చేయాలి. ఆ తరువాత మరో బౌల్‌లో ఈ-విటమిన్ కాప్సిల్‌లో ఉండే ఆయిల్‌ని తీసుకుని అందులో 1 స్పూన్ ఆముదం, 2 స్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా వేడి నీరు కూడా జత చేయాలి. దీన్ని తలకు పట్టించి 5 నిమిషాలపాటు మర్దనా చేయాలి. ఇలా మళ్లీ ఒకసారి చేయాలి. ఓ గంట సేపు ఉంచి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 4,5 సార్లు చేస్తే జుట్టు మృదువుగా ఉండడమే కాకుండా, పొడవుగా పెరుగుతుంది.
ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల కావచ్చు, మనం తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, రోజు రోజుకు పెరుగుతున్న వత్తిడి వల్ల కావచ్చు ఇలా అనేక కారణాల వల్ల చుండ్రు సమస్యని కూడా బాగా ఎదుర్కుంటున్నాము. దీని నివారణకు చక్కని చిట్కా మనకు తెలిసిన వస్తువులతోనే..
1 స్పూన్ మెంతి పోడి
1 స్పూన్ కుంకుడుకాయ పొడి
1 స్పూన్ పుల్లటి పెరుగు
పై మూడింటిని కలిపి గంటసేపు నానబెట్టాలి. దీన్నితలకు ప్యాక్‌లా వేసి 45 నిమిషాలు వుంచి గోరువెచ్చని నీళ్లతో కడగాలి. ఇది తలలో వుండే చుండ్రుని షాంపూలకంటే మెరుగ్గా నిర్మూలిస్తుంది.
4 స్పూన్ల ఉసిరిపొడి
4 స్పూన్ల కుంకుడుకాయ పొడి
4 స్పూన్ల శీకాయపొడి
పై మూడింటిని రాత్రిపూట నీటిలో నానబెట్టాలి. దీనికి ఉదయాన్నే 4 స్పూన్ల గోరింటపొడి కలిపి రెండు మూడు గంటలు నానబెట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
Also Read: