Holi 2022: భారతదేశం(India) లో హోలీ సందడి మొదలైంది. హిందువు(Hindus)లు ఈ పండగను ‘రంగుల పండుగ’ అని కూడా పిలుస్తారు. ఫాల్గుణ శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 18న హోలీని జరుపుకోనున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగానే కాదు.. వసంత రుతువుకు స్వాగతం చెబుతూ హోలీని జరుపుకుంటారు. స్నేహితులను, సన్నిహితులను కలిసి సంతోషముగా జరుపుకుంటారు. ఒకరినొకరు కౌగిలించుకుని మిఠాయిలు తినిపించుకుంటారు. హోలీని దేశంలో ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క విధంగా జరుపుకుంటారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో పండగలు, పర్వదినాల సమయంలో ఇంటి ముంగిట రంగవల్లులతో తీర్చిదిద్దుతారు. ముగ్గులు ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా హోలీని నామమాత్రంగా జరుపుకున్నారు. అయితే ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో.. హోలీని కలర్ ఫుల్ గా జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. హోలీని మరింత కలర్‌ఫుల్‌గా మార్చడానికి మేము మీ ఇంటి గుమ్మం వద్ద, దేవాలయం వద్ద పెట్టుకోవడానికి రకరకాల ముగ్గుల డిజైన్స్ మీకోసం..
Also Read: