Gomukhasana: నిద్రలేమి సమస్య, కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆసనాన్ని ట్రై చేస్తే సరి…

|

Jun 03, 2021 | 3:35 PM

Gomukhasana:ప్రస్తుతం కాలంలో మారుతున్నా జీవన పరిస్థితులతో కాలంతో పోటీ పడుతూ పనులు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఆరోగ్యం పై అంతగా శ్రద్ధ పెట్టె సమయం..

Gomukhasana: నిద్రలేమి సమస్య, కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆసనాన్ని ట్రై చేస్తే సరి...
Gomukhasana
Follow us on

Gomukhasana:ప్రస్తుతం కాలంలో మారుతున్నా జీవన పరిస్థితులతో కాలంతో పోటీ పడుతూ పనులు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఆరోగ్యం పై అంతగా శ్రద్ధ పెట్టె సమయం లేదు అని చాలామంది వ్యాఖ్యానిస్తుంటారు. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. ఇలా మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం, నీరు, శ్వాస, ఎండ ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. అయితే చాలా మందికి

నిద్ర సరిగ్గా పట్టక ఇబ్బంది పడుతుంటారు. మరికొంతమంది నిద్ర మాత్రలు మింగుతుంటారు. అయితే నిద్ర మాత్రలను ఎక్కువగా తీసుకుంటే ఇతర సమస్యలు వస్తాయి. ఈ నిద్ర లేమిని ఎటువంటి మాత్రలు వాడకుండానే యోగ చికిత్సతో సమస్యను పూర్తిగా నివారించవచ్చు. సుఖ నిద్ర కోసం వేయాల్సిన గోముఖాసన్‌  ఆసనం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..!

 గోముఖాసన్‌ వేయు పద్దతి: 

*ముందుగా నెల మీద ఏదైనా వేసుకుని కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.

* కుడి కాలిని వంచి ఎడమ తొడకు పక్కన ఉంచాలి.

*ఎడమ కాలిని వంచి కుడికాలి కింద నుండి తెచ్చి, తొడ ప్రక్కకు పెట్టాలి. అప్పుడు ఎడమ కాలిపై కుడి తొడ వస్తుంది.

*ఎడమ చేతిని పైనుంచి వీపు మీదకు తీసుకోవాలి.

*.కుడిచేతిని క్రిందనుండి వీపు మీదకు తీసుకొని ఎడమచేతి వ్రేళ్ళతో కుడి చేతి వేళ్ళని కలపాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.

*తరువాత వరుసగా కుడి చేయి, ఎడమ చేయి, ఎడమ కాలు, కుడి కాలు వెనక్కు తెచ్చి స్థితిలోకి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఇదే విధంగా ఎడమ కాలితో కూడా చేయాలి.

ఈ ఆసనం వల్ల లాభాలు: 

నాడీ మండల వ్యవస్థ మీద ప్రభావం ఉండటం వలన మనస్సు ప్రశాంతమవుతుంది. దానితో చక్కటి నిద్ర పడుతుంది. బి.పి. అదుపులో ఉంటుంది. భావోద్వేగాల నియంత్రణ అలవడుతుంది. మధుమేహం, వీపు నొప్పి, మూత్ర పిండాల వ్యాధి తగ్గుతాయి.

Also Read: ఉద్యోగం వదిలి.. మామిడితోటల పెంపకం.. ఏడాదికి రూ 50 లక్షల ఆదాయం..