Hair Stylist: జుట్టుని కాన్వాస్‌గా వాడేస్తున్న ఓ అమ్మాయి.. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో ఆకట్టుకుంటున్న మిలెనా

|

Nov 15, 2021 | 2:07 PM

German Woman-Hair Stylist Milena: మగువకు అందనాన్ని తెచ్చేది.. జుట్టు.. జుట్టున్న అమ్మ కొప్పు వేసినా, వాలుజడ వేసినా అందమే అని పెద్దలు అంటారు. అందమైన కుందనాల..

Hair Stylist: జుట్టుని కాన్వాస్‌గా వాడేస్తున్న ఓ అమ్మాయి.. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో ఆకట్టుకుంటున్న మిలెనా
German Woman Milena
Follow us on

German Woman-Hair Stylist Milena: మగువకు అందనాన్ని తెచ్చేది.. జుట్టు.. జుట్టున్న అమ్మ కొప్పు వేసినా, వాలుజడ వేసినా అందమే అని పెద్దలు అంటారు. అందమైన కుందనాల బొమ్మకు వాలు జడ ఎంతో అందాన్నిస్తుంది. జాలువారే పొడవాటి కురులు ఉంటే ఎలాంటి హెయిర్‌ స్టయిల్స్‌ అయినా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఓ 18 ఏళ్ల అమ్మాయి వేసే హెయిర్‌ స్టయిల్స్‌ని చూస్తే మతిపోక తప్పదు. జుట్టుని ఒక కాన్వాస్ లా వాడేస్తోంది ఈ అమ్మాయి. ఇక ఈ అమ్మాయి వేసిన జడలను చూస్తే ఆశ్చర్యపోతారు. జర్మనీకి చెందిన మిలెనా టీనేజర్‌గా ఉన్నప్పుడే ఫేమస్ హాలీవుడ్ స్టైలిస్టులతో కలిసి పనిచేసింది. ఈమెకు చిన్నప్పటి నుంచే జుట్టుతో అల్లికలు వెయ్యడం అంటే ఇష్టం. స్కూల్ డేస్‌లో… ఆరేడేళ్ల వయసులోనే ఈ జడలపై చాలా ప్రయోగాలు చేసింది. ట్యూటోరియల్స్ చూసి రకరకాల అల్లికల టెక్నిక్స్ నేర్చుకుంది. ఎంతో కష్టమైన హెయిర్‌స్టైల్స్ కూడా ఈజీగా వేసేస్తోంది.

ఈ హెయిర్ స్టైల్స్ కోసం మిలెనా ఎక్కడా ట్రైనింగ్ కూడా తీసుకోలేదు. పైగా ఆమెకు ఏ స్టూడియో కూడా లేదు. అన్ని ప్రయోగాలూ తానే సొంతంగా చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన హెయిర్ స్టైల్స్‌ని చూస్తే… ఆశ్చర్యపోతారు. జర్మనీలోని తన సొంత పట్టణంలో… హెయిర్ అండ్ బ్యూటీ రెసిడెంజ్ పేరుతో చిన్న సెలూన్ పెట్టుకొని అందులోనే ఇవన్నీ చేస్తోంది. ఈ వృత్తిలో ఇప్పటికే ఆమె 12 ఏళ్ల సీనియర్‌ అయిపోయింది.

ఇక మిలెనా ఏ సెలబ్రిటీల స్టైల్స్‌నీ ఫాలో అవ్వదు. తన మైండ్‌లో ఏదనిపిస్తే అది చేయడం ఈమె ప్రత్యేకత. ఈ విషయంలో మిలెనాకు కుటుంబ సభ్యుల నుంచే కాదు.. సోషల్‌మీడియాలో తన ఫాలోయర్స్‌ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. త్వరలోనే లైసెన్స్ పొంది… ఫ్యాషన్ షోలలో తన హెయిర్ స్టైల్స్‌ని ప్రపంచానికి చూపేందుకు రెడీ అవుతోంది మిలెనా…

Also Read:  వివాదంలో సూర్య జై భీమ్.. రూ.5 కోట్ల నష్టపరిహారం కోరుతున్న వన్నియార్ సంగం..