Fashion Tips: చీరలు కట్టుకునేటప్పుడు ఈ టిప్స్ పాటించండి.. లుక్కే మారిపోతుంది!

| Edited By: Phani CH

Oct 06, 2023 | 10:08 PM

భారత దేశ సంప్రదాయం చీరలోనే ఉంది. చీరలపై ఎన్నో పాటలు, పద్యాలు, కవితలు చాలా ఉన్నాయి. అసలు భారతీయుల సంప్రదాయం పుట్టింది చీరలోనే. చీరలు కట్టుకుంటే మహిళలు పద్దతిగా కనిపించడమే కాకుండా రెస్పక్ట్ కూడా పెరుగుతుంది. అందుకే విదేశీయులు కూడా మన చీరల పద్దతిని ఇష్టపడుతున్నారు. చీరలనే కట్టుకుంటున్నారు. చీరల్లో అనేక రకాలు ఉంటాయి. పట్టు, సిల్క్, కాటన్, జార్జెట్, వర్క్ ఇలా అనేక రకాలు ఉంటాయి. ఏది కట్టినా దానికి తగ్గట్టుగా రెడీ అయితే మాత్రం..

Fashion Tips: చీరలు కట్టుకునేటప్పుడు ఈ టిప్స్ పాటించండి.. లుక్కే మారిపోతుంది!
Sarees Stylling
Follow us on

భారత దేశ సంప్రదాయం చీరలోనే ఉంది. చీరలపై ఎన్నో పాటలు, పద్యాలు, కవితలు చాలా ఉన్నాయి. అసలు భారతీయుల సంప్రదాయం పుట్టింది చీరలోనే. చీరలు కట్టుకుంటే మహిళలు పద్దతిగా కనిపించడమే కాకుండా రెస్పక్ట్ కూడా పెరుగుతుంది. అందుకే విదేశీయులు కూడా మన చీరల పద్దతిని ఇష్టపడుతున్నారు. చీరలనే కట్టుకుంటున్నారు. చీరల్లో అనేక రకాలు ఉంటాయి. పట్టు, సిల్క్, కాటన్, జార్జెట్, వర్క్ ఇలా అనేక రకాలు ఉంటాయి. ఏది కట్టినా దానికి తగ్గట్టుగా రెడీ అయితే మాత్రం పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. కొంత మంది మంచి చీరలు కడతారు. కానీ దానికి తగ్గుట్టుగా మాత్రం రెడీ అవ్వరు. దీంతో ఎంత ఖరీదు శారీ కట్టినా వేస్ట్ అవుతుంది. శారీ కట్టినప్పుడు పర్ఫెక్ట్ లుక్ కావాలంటే ఈసారి ఈ టిప్స్ ను పాటించండి.

చీరలు ఎలా కట్టుకోవాలి:

ముఖ్యంగా చీర కట్టడంలోనే దాని అందం అంతా ఉంటుంది. కొంత మంది ఎలా పడితే అలా కట్టి చీర అందాన్ని పాడు చేస్తారు. సింగిల్ పైట అయినా.. స్టెప్స్ పెట్టుకున్న శారీ అయినా నీటిగా వేర్ చేస్తేనే సింపుల్ గా ఉన్నా అట్రాక్షన్ అవుతాం. కాబట్టి చీర కట్టేటప్పుడు ఖచ్చితంగా కొన్ని రకాల టెక్నిక్స్ పాటించాలి.

ఇవి కూడా చదవండి

చీరకు సెట్ అయ్యే మ్యాచింగ్ ఇన్నర్స్, జ్యువెలరీ సెట్ చేసుకోవాలి. చీర సింపుల్ గా ఉన్నప్పుడు బ్లౌజ్ ని హైలెట్ చేయాలి అప్పుడు మంచి లుక్ వస్తుంది. అలాగే చీర హెవీగా ఉంటే.. బ్లౌజ్ నార్మల్ గా కుట్టిస్తే సరిపోతుంది. వీటికి తగ్గట్టుగానే జ్యువెలరీ సెట్ చేసుకోవాలి.

కుచ్చుళ్లు నీట్ గా వచ్చేలా చూసుకోండి:

ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లేటప్పుడు కాస్త హడావిడిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో స్టెప్స్, కుచ్చుళ్లు సరిగ్గా రావు. అలాంటప్పుడు మీరు ఫంక్షన్ కు వెళ్లే ఒక రోజు ముందు రాత్రే మీకు ఎలా అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందో అలా స్టెప్ప్.. పెట్టుకోవాలి. అంతే కాకుండా గాజులు, నెయిర్ పాలిష్, జ్యువెలరీ సిద్ధం చేసుకోవాలి. లేదంటే ఉదయం హడావిడిగా ఉంటుంది. కుచ్చుళ్లు సరిగ్గా రావాలంటే ఐరన్ బాక్స్ ఉపయోగించి నీటిగా సెట్ చేసుకోవాలి.

ఏ చీరలకు ఏ నగలు మ్యాచింగ్ అవుతాయి:

చీరలు కట్టుకునేటప్పుడు జ్యువెలరీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. లేదంటే అంత లుక్ రాదు. కాబట్టి జ్యువెలరీ చాలా ముఖ్యం. పట్టు చీరలు కట్టుకున్నప్పుడు గోల్డ్ కలర్ జ్యువెలరీ లేదా గోల్డ్ వేసుకున్నా బావుంటుంది. ప్లెయిన్ కలర్ శారీస్ కట్టుకున్నప్పుడు యాంటిక్ జ్యువెలరీ, ముత్యాలు వంటివి సెట్ అవుతాయి. ఇక వర్క్ శారీస్ కట్టుకున్నప్పుడు.. సింపుల్ గా ఉండే స్టోన్స్ అయితే చక్కగా మ్యాచ్ అవుతాయి.

కాబట్టి ఖరీదైన చీరలు కట్టుకోవడమే కాదు.. అవి ఎలా కట్టుకోవాలి.. గాజులు, జ్యువెలరీ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. ఇలా సింపుల్ టిప్స్ పాటిస్తే చక్కగా కనిపిస్తారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.