కరోనా నుంచి రక్షణ పొందేందుకు మనం కొన్ని జాగ్రత్తలను నిత్యం పాటిస్తూనే ఉండాలి. మాస్క్ ధరించడం.. సామాజిక దూరం.. చేతులు ప్రతిసారి వాష్ చేసుకోవడం.. శానిటైజర్ వాడడం ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అయితే ఉద్యోగాలు చేసేవారు రోజూ గంటల తరబడి మాస్క్ ధరించాల్సి వస్తుంది. కాసేపు మాస్క్ తీసి పక్కన పెట్టాలంటే కరోనా భయం. అయితే కోవిడ్ నుంచి రక్షించడంలో మాస్క్ పనిచేస్తున్నా.. ఇతర వ్యాధులను కలిగిస్తున్నాయి. చర్మ వ్యాధులు, మొటిలు, దద్దుర్లు, చర్మం కమిలిపోవడం వంటి సమస్యలు చాలా మంది ఉద్యోగస్తులు ఎదుర్కుంటున్నారు. అంతేకాకుండా.. బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. అయితే మాస్క్ గంటల తరబడి ధరించేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు అవెంటో తెలుసుకుందామా.
✻ జాగ్రత్తలు ✻
☛ ముఖానికి బిగుతుగా ఉండే మాస్కులు కాకుండా.. కాస్తా వదులుగా ఉండేవి ఎంచుకోవాలి. వీటి వలన మీ చర్మంపై ఉండే రంధ్రాలకు అడ్డుతగలకుండా ఉండడమే కాకుండా… స్కీన్లోని ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. దీంతో మొటిమల సమస్య తగ్గుతుంది.
☛ మాస్కులను ఎప్పుడూ శుభ్రం చేస్తూ ఉండాలి. ఒక్కసారి వాడిన మాస్కులను శుభ్రం చేయకుండా వాడకూడదు. ఇలా చేయడం వలన మీ చర్మంపై మంట, దద్దుర్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.
☛ ముఖాన్ని రోజులో ఎక్కువ సార్లు కడుగుతూ ఉండాలి. అలాగే మాస్క్ తొలగించిన తర్వాత ముఖాన్ని కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే.. మాస్క్ పై ఉండే బ్యాక్టిరీయా గంటల తరబడి చర్మంపై ఉండిపోయి..నష్టం చేకూరుస్తాయి. అయితే సబ్బులతో ముఖాన్ని కడగకుండా.. ఫేస్ వాష్, టోనర్ వంటివి వాడడం మంచిది.
☛ మాస్కులను ఉపయోగిస్తున్న సమయంలో కొత్త క్రీంలను ఉపయోగించడకోవడం మంచిది. చర్మాన్ని మాయిశ్చరైజర్‌తో హైడ్రేట్‌గా ఉండనివ్వాలి. అలాగే యూవిఏ, యూవిబి కిరణాలు నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్‌ను వాడండి.
☛ మాస్క్ తీసిన తర్వాత కలబంద జెల్, పసుపు మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. కలబంద, పసుపులోని యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు చర్మ సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాకుండా.. మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి.
Also Read: చిన్న స్క్రూ ఎంత పని చేసింది ! హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిందిగా.