ఎండాకాలంలో జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా ? అయితే ఈ సులభమైన టిప్స్ ఫాలో అవ్వండి..

|

May 05, 2021 | 9:42 PM

జుట్టు సమస్యలు ప్రతి ఒక్కరు ఎదుర్కోంటుంటారు. ఇక ఈ సమస్యలు ఎండాకాలంలో వడదెబ్బ, ఎండ, చెమటలు జుట్టుకు చికాకు కలిగిస్తుంది.

ఎండాకాలంలో జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా ? అయితే ఈ సులభమైన టిప్స్ ఫాలో అవ్వండి..
Hair Tips
Follow us on

జుట్టు సమస్యలు ప్రతి ఒక్కరు ఎదుర్కోంటుంటారు. ఇక ఈ సమస్యలు ఎండాకాలంలో వడదెబ్బ, ఎండ, చెమటలు జుట్టుకు చికాకు కలిగిస్తుంది. అధిక వేడి కారణంగా, జుట్టు పొడిగా మారడం ప్రారంభమవుతుంది. ఇక వేసవిలో జుట్టును రక్షించుకునేందుకు ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే వేసవిలో జుట్టును రక్షించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి.

వేసవిలో జుట్టు ఎక్కువగా జిడ్డుగా మారుతుంది. అందుకే మంచి సల్ఫేట్ లేని షాంపూ, కండీషనర్ వాడటం మంచిది. ఇది నూనెను అదుపులో ఉంచుతుంది. అలాగే తలలో పిహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. అలాగే జుట్టులో అలెర్జీని తగ్గిస్తుంది. షాంపూ, కండీషనర్ ఉపయోగించి చర్మం నూనెలను తగ్గిస్తుంది.

ఇక ఎండాకాలంలో ఉష్ణోగ్రత పెరగడంతో జుట్టు ఎక్కువ వేడిని పీల్చుకుంటుంది. అంతేకాకుండా స్టైలింగ్ ఉత్పత్తుల వలన జుట్టు మరింత దెబ్బతింటుంది. హీట్ స్టైలింగ్ సాధనాలను ఉపయోగించడం తగ్గించడమే ఉత్తమం. అలాగే స్టైలింగ్ అవసరమైనే సీరం ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. కాలానుగుణ మార్పులు తలలో చికాకు కలిగిస్తాయి. పొరలుగా ఉండే చర్మం అదనపు జుట్టు రాలడానికి కారణమవుతుంది కాబట్టి ఏదైనా చర్మం అలెర్జీని తగ్గించడానికి ఓదార్పు చికిత్సలను ఉపయోగించడం చాలా ముఖ్యం. ఏదైనా వడదెబ్బ లేదా దురదను తగ్గించడానికి మరియు తేలికపాటి షాంపూతో శుభ్రం చేయుటకు, అలోవెరా జెల్ ను నేరుగా మీ తలపై రాయండి. ఇది మీ జుట్టును శుభ్రపరుస్తుంది మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. వేసవిలో జుట్టు అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. మన జుట్టు చివరలు తడిలేకుండా,  పొడిగా మారుతాయి. కాబట్టి జుట్టును హైడ్రేట్ చేయడానికి, పొడి చివరలను తొలగించడానికి డీప్ కండిషనింగ్ చేయండి. తలమీద మరియు జుట్టు పొడవుకు పోషకాలను అందించే హెయిర్ మాస్క్ లను ఎంపిక చేసుకోండి. మీకు జిడ్డుగల చర్మం ఉంటే, జిడ్డును తొలగించే హెయిర్ మాస్క్ వాడండి. ఇది మీ జుట్టును హైడ్రేట్ చేయడానికి అలాగే వేసవి నుండి మిమ్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది.

Also Read: కరోనా కాలంలో ఇంట్లో ఉండే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా ? అయితే ఇలాంటి ఫుడ్ తీసుకుంటే రిజల్ట్ పక్కా..

Covid Care: బీపీ, షుగర్, ఒబేసిటీ ఉన్నవారు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసా..