Flaxseed Gel: అవిసెగింజలతో జట్టు సమస్యలకు చెక్.. ఫ్లాక్స్ సీడ్ జెల్ ఉపయోగాలు తెలిస్తే షాకే..

|

Dec 15, 2021 | 9:24 PM

Flaxseed Gel Benefits: అవిసె గింజలల్లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అవిసె గింజలతో సలాడ్‌లతోపాటు పలు రకాల వంటకాలు చేసుకోవచ్చు. అందుకే అవిసె గింజలను

Flaxseed Gel: అవిసెగింజలతో జట్టు సమస్యలకు చెక్.. ఫ్లాక్స్ సీడ్ జెల్ ఉపయోగాలు తెలిస్తే షాకే..
Follow us on

Flaxseed Gel Benefits: అవిసె గింజలల్లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అవిసె గింజలతో సలాడ్‌లతోపాటు పలు రకాల వంటకాలు చేసుకోవచ్చు. అందుకే అవిసె గింజలను ఔషధాల్లో ఉపయోగిస్తారు. అయితే ఇందులో అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపే గుణాలున్నాయని చాలా తక్కువమందికి తెలుసు. మీరు జుట్టు సంరక్షణ కోసం అవిసె గింజలను కూడా ఉపయోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఈ విత్తనాల నుంచి జెల్ (ఫ్లాక్స్ సీడ్ జెల్) ను తయారు చేసుకోవచ్చు. ఇది మీ జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది. అవిసె గింజల జెల్ ప్రయోజనాలు, ఇంట్లో తయారు చేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లాక్స్ సీడ్ హెయిర్ జెల్ తయారీ విధానం..
ఫ్లాక్స్ సీడ్ హెయిర్ జెల్ తయారు చేయడానికి మీకు 4 పదార్థాలు అవసరం. ఇందులో 4 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, 2 విటమిన్ ఇ క్యాప్సూల్స్, 2 టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ అవసరం. ముందుగా 2 కప్పుల నీళ్లు మరిగించి అందులో అవిసె గింజలు వేయాలి. నీరు చిక్కబడే వరకు ఉడకనివ్వాలి.

మంటను ఆపివేసి, జెల్లీ లాంటి అవశేషాలను జల్లెడ లేదా మెత్తటి క్లాత్‌ను ఉపయోగించి ఫిల్టర్ చేయండి. మిశ్రమం చల్లారాక అందులో అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సూల్స్, బాదం నూనె వేయాలి. బాగా కలపితే.. ఇది జెల్ లాగా మారుతుంది. చల్లని ఉష్ణోగ్రతలో ఈ మిశ్రమాన్ని ఒక కూజాలో నిల్వ చేయండి. దీన్ని మీ జుట్టుకు పట్టించి మసాజ్ చేయండి. ఒక గంటసేపు ఉంచి తలస్నానం చేస్తే.. జుట్టు తళతళ మెరుస్తుంది.

ఫ్లాక్స్ సీడ్ హెయిర్ జెల్ ప్రయోజనాలు
అవిసె గింజలు మీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. దీంతోపాటు వేగంగా జుట్టు పెరుగుదలకు సహాయపడే B విటమిన్లను కూడా జుట్టుకు అందిస్తాయి.

ఇదే కాకుండా, అవిసె గింజలో విటమిన్ ఇ కూడా ఉంటుంది, ఇది మీ తలపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో వేగంగా జుట్టు పెరుగుతుంది.

అవిసె గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి చేపలలో కూడా కనిపిస్తాయి. కానీ అవిసె గింజలలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అని పిలువబడే ఆమ్లాలు ఉంటాయి. ఇవి స్కాల్ప్‌లో మంటను తగ్గించి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

అవిసె గింజల్లో తేమ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టు పొడిగా ఉండటాన్ని నివారిస్తాయి. అవిసె గింజల్లో విటమిన్ ఇ, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

అవిసె గింజల్లో ఉండే ఫైబర్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు మేలు చేస్తాయి. ఇది జుట్టును బలంగా మార్చడంలో సహాయపడతాయి.

అవిసె గింజల్లో యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గించడంలో, జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

Also Read:

Side Effects of Amla: ఈ వ్యక్తులు ఉసిరికాయలను అస్సలు తినకూడదట.. ఎందుకో తెలుసుకోండి..

PM Narendra Modi: బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..