Almond Oil Benefits: బాదం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీంతోపాటు బాదం నూనె చర్మ సంరక్షణలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఎన్నో పోషకాలు ఉన్న బాదం నూనె (Almond Oil) చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా నిగనిగలాడేలా చేస్తుంది. సాధారణంగా చాలామంది మొహంపై నల్లటి మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు, మొటిమలు లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే.. ఆ సమస్యలతోపాటు ఇంకా ఏమైన ముఖానికి సంబంధించిన ఇబ్బందులుంటే.. బాదం నూనెను చర్మ సంరక్షణ కోసం ఉపయోగించుకోవాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. బాదం నూనెతో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో (Skin Care Tips) ఇప్పుడు తెలుసుకుందాం..
మొహంపై ముడతలు: ఉరుకులు పరుగుల జీవితం, మన జీవనశైలి, ఒత్తిడి కారణంగా కళ్ల కింద ముడతలు యవ్వన దశలోనే కనిపించడం ప్రారంభమవుతుంది. వాటిని తొలగించుకోవడానికి.. రాత్రి పడుకునే ముందు బాదం నూనెను ముఖంపై మసాజ్ చేస్తే చాలా మంచిది.
నల్లటి వలయాలు: నిద్ర లేకపోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. వాటిని వదిలించుకోవటం అంత సులభం కాదు. అలాంటి సమస్యతో బాదపడుతున్న వారు బాదం నూనె ట్రై చేయడం ఉత్తమం. బాదం నూనెలో రోజ్ వాటర్ మిక్స్ చేసి కళ్ల చుట్టూ మసాజ్ చేయాలి. రాత్రిపూట మాత్రమే ఈ పద్దతిని పాటిస్తే ప్రయోజనం ఉంటుంది.
స్కిన్ గ్లో: చర్మం కాంతివంతంగా మెరవాలంటే.. బాదం నూనెలో కొంచెం బియ్యంపిండి, రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మసాజ్ చేసి, ఆపై గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ప్రక్రియ తర్వాత మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
యాంటీ ఏజింగ్: ఈ సమస్య నుంచి బయటపడాలంటే బాదం నూనెలో విటమిన్ ఇ క్యాప్సూల్, అలోవెరా జెల్ కలిపి ముఖానికి మర్దన చేయాలి. ఈ యాంటీ ఏజింగ్ లైట్ క్రీమ్ సహాయంతో ముఖంపై తేమ కూడా అలాగే ఉంటుంది. అంతేకాకుండా ఫేస్ నిగనిగలాడుతుంది.
Also Read: