తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తాప్సీ పన్నూ.. ఆకస్మాత్తుగా బాలివుడ్కు షిప్ట్ అయిపోయింది. అక్కడ కూడా అమ్మడి అదృష్టం బాగానే ఉండడంతో.. సూపర్ హిట్ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తుందంటే తాప్సీ ఏ రెంజ్లో బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో టాలీవుడ్ వైపు ఈ అమ్మడు చూపు ఏమాత్రం వేయడం లేదు. మహి డైరెక్షన్లో తెరకెక్కిన ఆనందో బ్రహ్మ సినిమా తర్వాత తాప్సీ తెలుగు సినిమాల్లో నటించలేదు. అయతే చాలా కాలం తర్వాత మాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనున్న మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాకు దర్శకత్వం వహించిన స్వరూప్ దీనిని తెరకెక్కించనున్నాడు.
అయితే తాప్సీ ఈ సినిమా కోసం స్థిరమైన దుస్తులను ఎంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. చాలా కాలం తర్వాత మార్పులు ప్రారంభించడానికి తక్కువ వస్త్ర వ్యర్థాలను ఉపయోగించేలా స్థిరమైన సార్టోరియల్ ఎంపికలను స్వీకరిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర కోసం రీసైకిల్, మిగిలిన వస్త్రాలతో తయారు చేసి బట్టలను ధరించింది. తాప్సీ సోషల్ మీడియాలో.. “షూటింగ్ సమయంలో మనం ఉపయోగించిన బట్టలు వృధాగా మారిపోవడం చాలా విచారకరం అని ఎన్నోసార్లు అనుకున్నాను. భద్రంగా దాచిపెట్టినవి చివరకు ఎక్కడో విసిరేస్తారు. చాలా తక్కువ మంది నిర్మాతలు వాటిని ఉపయోగించడం లేదా రీసైక్లింగ్ చేయడం గురించి ఆలోచిస్తారు. అందుకే నా సినిమాలో నేను నా దుస్తులకు బయోడిగ్రేడబుల్ లేదా రీసైకిల్ వస్త్రాలను ఉపయోగించాలనుకుంటున్నాను. మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో నేను రీసైకిల్ చేసిన దుస్తులను దరించాలనుకుంటున్నారు. ఇందులో ఇలాంటి బట్టలు వేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. డిజైనర్ ఇంద్రకాశి పట్టానాయక్ చేసిన ఈ ఆలోచన నాకు చాలా నచ్చింది. ఇదే పద్ధతి నా తర్వాతి చిత్రాలలో కూడా ఉపయోగించాలనుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ. జాతీయ అవార్డు గెలుచుకున్న కాస్ట్యూమ్ డిజైనర్ ఇంద్రాక్షి పట్నాయక్ ఈ సినిమాకు ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.
Also Read: TS News: రాత్రుళ్లు వింత శబ్దాలు.. జనాలు హడల్.. మగవాళ్లను బలితీసుకుంటున్న వింత ఆకారం!
Beggar Donations: భిక్షాటన సొమ్ము కరోనా నివారణ, విద్యార్థుల చదువులకు సాయం.. దానశీలిగా మారిన వృద్దుడు