Mobile Phone: స్మార్ట్ ఫోన్.. ప్రపంచగతిని మార్చిన ఓ అద్భుత గ్యాడ్జెట్. ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే కేవలం దూరంగా ఉన్న వారితో మాట్లడడానికి ఉపయోగించే ఓ సాధనం. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేయలేని పనంటూ ఏది లేదు. రైల్వే బుకింగ్ నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి వరకు అన్ని ఫోన్లలోనే చేసేస్తున్న రోజులివి. అయితే కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు.. స్మార్ట్ ఫోన్‌తో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌ను విపరీతంగా వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
స్మార్ట్ ఫోన్ వాడితే కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయని మనకు ఇప్పటి వరకు తెలుసు. అయితే స్మార్ట్ ఫోన్‌తో మధుమేహం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని మీకు తెలుసా.? అదేంటీ స్మార్ట్ ఫోన్‌కు మధుమేహానికి లింక్ ఏంటనేగా మీ సందేహం.. అసలు విషయం ఏంటంటే.. సాధారణంగా స్మార్ట్ ఫోన్‌ల నుంచి బ్లూ లైట్ వస్తుందనే విషయం మనకు తెలిసిందే. అయితే రాత్రిపూట ఈ బ్లూ కలర్ కంటిపై పడడం వల్ల తియ్యటి ఆహారాలు తినాలకే కోరిక పెరుగుతుందట. ఈ కారణంగా ఊబకాయంతో పాటు షుగర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ విషయాన్ని స్ట్రాస్‌బర్గ్ విశ్వవిద్యాలయం, ఆమ్‌స్టర్‌డామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలుకలపై చేసిన పరిశోధనలో ఈ నిజాలు వెల్లడయ్యాయి. ఇక రాత్రి సమయాల్లో కృత్రిమ కాంతిలో ఎలుకలను ఉంచినప్పుడు వాటి శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి నేరుగా కాంతి కళ్లపై పడకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: World Richest Dog: వేల కోట్ల ఆస్తికి వారసురాలు ఈ కుక్క !! వీడియో
Viral Video: ఆమె పాటకు నోట్ల వర్షం కురిపించిన జనాలు !! వీడియో
Vastu Tips: లక్ష్మీదేవి నిలవాలంటే ఈ వాస్తు తప్పులు అస్సలు చేయకండి.. చాలా కోల్పోతారు..