Health: ఆ సమస్యలతో బాధపడే వారు చికెన్ తినవద్దు.. జాగ్రత్త వహించాలని నిపుణుల వార్నింగ్.. లేకుంటే

|

Sep 02, 2022 | 12:58 PM

నాన్ వెజ్ ప్రియులకు చికెన్ (Chicken) అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం. పార్టీ ఏదైనా అందులో కచ్చింగా చికెన్ ఉండాల్సిందే. చికెన్‌ ఐటమ్స్ ను ఇష్టంగా లాగించేస్తారు. చికెన్ లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని...

Health: ఆ సమస్యలతో బాధపడే వారు చికెన్ తినవద్దు.. జాగ్రత్త వహించాలని నిపుణుల వార్నింగ్.. లేకుంటే
Chicken
Follow us on

నాన్ వెజ్ ప్రియులకు చికెన్ (Chicken) అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం. పార్టీ ఏదైనా అందులో కచ్చింగా చికెన్ ఉండాల్సిందే. చికెన్‌ ఐటమ్స్ ను ఇష్టంగా లాగించేస్తారు. చికెన్ లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంతో పాటు కండరాలు దృఢంగా మారేందుకు సహాయపడుతుంది. చికెన్ బ్రెస్ట్‌లో లూసిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఎంత ఇష్టమైనా.. ఎన్ని ప్రయోజనాలున్నా చికెన్‌ ఎక్కువగా తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందనే విషయాన్ని గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ చికెన్ తింటే ఆరోగ్య సమస్యలు (Health Problems వస్తాయని హెచ్చరిస్తున్నారు. చికెన్ కొనేటప్పడు, వండే సమయంలో జాగ్రత్త వహించాలని మనం చేసే అతి చిన్న పొరపాట్ల కారణంగా భారీ మూల్యం చెల్లించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌ ప్రకారం చికెన్‌ ఎక్కువగా తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ లెవెల్స్ పెరుగుతాయి. తద్వారా రక్తం చిక్కబడుతుంది. రక్తనాళాల్లో ప్రవాహం సరిగా జరగక, గుండెకు రక్తం అందదు. దీంతో గుండె సంబంధిత సమస్యలు వస్యాయి.

చికెన్‌ లో ఉండే ప్రొటీన్ వల్ల బరువు వేగంగా పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు చికెన్ కు దూరంగా ఉండటం మంచిది. శాకాహారుల కంటే నాన్-వెజ్ తినే వారి శరీర బరువు అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. చికెన్‌ అధికంగా తీసుకుంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే తాజా చికెన్‌ కొనడం, చికెన్‌ తక్కువగా తినడం వంటివి పాటించాలి. శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ మోతాదు మించితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మూత్రపిండాల సమస్యలు వస్తాయి. వ్యర్థాలు సరిగ్గా ఫిల్టర్ అవక, మూత్ర నాళ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి తక్కువ మోతాదులోనే చికెన్ తినాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.