మనసుకు నచ్చిన వారికి తమ ప్రేమను తెలియజేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన విధానాన్ని ఎంచుకుంటారు. కొందరు కవితలు, మాటలు చెప్పేందుకు ఇష్టపడితే మరికొందరు మాత్రం గిఫ్ట్ లు, బొకేలు ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇంకొందరు మాత్రం హగ్ చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఇష్టమైన వ్యక్తిని మనసారా హగ్ చేసుకోవడం వల్ల కలిగే సాంత్వన అంతా ఇంతా కాదు. సంతోషంగా ఉన్నా బాధలో ఉన్నా ఓదార్పు కోరుకునే సమయంలో ఎవరైనా మనతో పాటు ఉంటే బాగుండు అనిపిస్తుంది. కౌగిలించుకోవడం అనేది ఓదార్పు కు తెలిసిన బాష. ఇది మనల్ని సంతోషంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. వాస్తవానికి ఒత్తిడిని తగ్గించడానికి కౌగిలింతలు ఉత్తమమైన పరిష్కారమని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాకుండా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆరోగ్యం కోసం మీరు రోజుకు ఎన్ని సార్లు కౌగిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి వ్యక్తి జీవించడానికి రోజుకు 4 కౌగిలింతలు, నిలదొక్కుకోవడానికి రోజుకు 8 కౌగిలింతలు, వృద్ధి చెందడానికి రోజుకు 12 కౌగిలింతలు అవసరమని ప్రముఖ మనస్తత్వవేత్త వర్జీనియా సతీర్ సూచించారు. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటివి మానసిక ఇబ్బందులు. వీటిని ఎవరితోనూ చెప్పుకోకుండా మోస్తూ ఉంటే మనసుకు భారంగా అనిపిస్తుంది. ఏదో తెలియని ఆందోళన మనల్ని ఫాలో అవుతున్న ఫీల్ కలుగుతుంది. ఇది అధిక రక్తపోటు, ఉబ్బసం, మధుమేహం వంటి తీవ్రమైన పరిస్థితులకూ దారి తీయవచ్చు. భావోద్వేగాలను కమ్యూనికేట్ చేయడంలో ఇబ్బందులు, ఓదార్పు కోరితే హగ్ చేసుకోవడం అనేది మంచి బెనెఫిట్స్ ను అందిస్తాయి.
కొంత మంది ఒంటరిగా జీవించడాన్ని ఇష్టపడుతుంటారు. అలాంటి వారు బాధలో ఉన్నప్పుడు సహాయాన్ని కోరుకుంటారు. అయితే వారి మనసుకు దగ్గరైన వారు అందుబాటులో ఉండక, వారి కష్టాలను చెప్పుకోలేక లోలోపల సతమతమవుతుంటారు. అలాంటి వారు తమతో పాటు పెట్స్ ను పెంచుకోవాలని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటితో ఇంటరాక్ట్ అవ్వడం, డ్యాన్స్ చేయడం, యోగా వంటి హాబీలను అలవాటుగా చేసుకోవాలి. చివరగా.. కౌగిలంత అనేది శరీరానికే కాదు.. మనస్సుకూ సంబంధించినదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి