ఇంట్లోకి దోమలు ఎక్కువగా వస్తున్నాయా..? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేసి చూడండి..!

ఇంట్లో దోమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే దీన్ని పరిష్కరించేందుకు సహజమైన చిట్కాలను పాటించండి. వేప, కర్పూరం ధూపం వెలిగిస్తే దోమలు ఇంటి నుంచి వెళ్లిపోతాయి. సాంబ్రాణి పొగ దోమలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిని నలిపి, నూనె, కర్పూరంతో కలిపి వెలిగిస్తే దోమలు చనిపోతాయి.

ఇంట్లోకి దోమలు ఎక్కువగా వస్తున్నాయా..? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేసి చూడండి..!
Effective Home Remedies

Updated on: Feb 10, 2025 | 7:34 PM

దోమలు రాకుండా తులసి, వేప, కలబంద వంటి మొక్కలను పెంచండి. అలోవెరా జెల్ దోమ కాటుకు ఉపశమనం ఇస్తుంది. పిప్పరమింట్ ఆయిల్ నీటిలో కలిపి స్ప్రే చేస్తే దోమలు పారిపోతాయి. ఈ సహజ చిట్కాలు దోమల సమస్యను తగ్గించి, ఇంటిని దోమల నుండి రక్షించేందుకు ఉపయోపడతాయి. వీటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వేప, కర్పూరం ధూపం

దోమలను తరిమికొట్టడానికి ఇది ఒక పురాతన, ప్రభావవంతమైన పద్ధతి. సాయంత్రం వేళల్లో మీ ఇంటి తలుపులు, కిటికీలను మూసివేసి.. కర్పూరం కలిపిన వేప ఆకులను వెలిగించి వాటి నుండి వచ్చే పొగను ఇల్లు అంతటా వ్యాపింపజేయండి. ఇలా చేయడం వల్ల దోమలు తిరిగి ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

సాంబ్రాణి ధూపం

సాంబ్రాణి ఇంటికి సువాసనను జోడించడమే కాకుండా దోమలను తరిమికొట్టడంలో కూడా సహాయపడుతుంది. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే తలుపులు, కిటికీలు మూసివేసి ఇంటి అంతటా పొగ వ్యాపించేలా సాంబ్రాణిని వెలిగించండి. మీరు ఇలా చేస్తే మీ ఇంటిలో మంచి వాసన రావటమే కాకుండా దోమల వల్ల కూడా ఇబ్బంది ఉండదు.

వెల్లుల్లితో దోమల నివారణ

వెల్లుల్లిని వంటకే కాకుండా దోమలను తరిమికొట్టడానికి కూడా ఉపయోగిస్తారు. వీటి నుండి వచ్చే సువాసన మీ ఇంటి నుండి దోమలను తరిమివేస్తుంది. దీనికోసం 4-5 వెల్లుల్లి రెబ్బలను బాగా నలిపి, దానికి కొద్దిగా నూనె, కర్పూరం వేసి వెలిగించాలి. ఆ పొగ ఇంటి అంతటా వ్యాపిస్తుంది. దీనివల్ల దోమలు చనిపోతాయి.

దోమలను నివారించే మొక్కలు

మీ ఇంటి చుట్టూ తులసి, వేప, కలబంద వంటి మొక్కలు ఉంటే దోమలు రావు. అంతే కాకుండా కలబందను దోమ కాటుకు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. దోమ కాటుకు అలోవెరా జెల్ రాస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా తులసి ఆకులు లేదా వేప ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి దోమ కాటుకు పూయడం వల్ల దద్దుర్లు, దురదలు నివారించబడతాయి.

పిప్పరమింట్ ఆయిల్ స్ప్రే

ఇంట్లో దోమలను తరిమికొట్టడంలో పిప్పరమింట్ ఆయిల్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీనికోసం మీరు ఒక స్ప్రే బాటిల్‌లో నీటిని కలిపి దానికి కొన్ని చుక్కల నూనె వేసి.. బాగా కలిపి, ఇంటిలో అంతటా స్ప్రే చేయవచ్చు. దోమలు వాసనను తట్టుకోలేవు కాబట్టి అవి ఇంటి నుండి పారిపోతాయి. ఈ చిట్కాలు దోమల సమస్యను పరిష్కరించడానికి మీకు సహాయపడతాయి.