Eating on Bed: మంచం మీద కూర్చుని తింటే ఇంట్లో పెద్దోళ్లు ఎందుకు తిడతారో తెలుసా? అసలు కారణం ఇదే

రోజువారీ జీవనశైలిలో మనం చేసే చిన్న చిన్న పొరబాట్లు పెద్దపెద్ద సమస్యలను ఆహ్వానిస్తాయి. జీవనశైలిలో ఇలాంటి పొరబాట్లు నిరోధించడానికి మన పెద్దలు పద్ధతులు, ఆచారాల పేరిట ఎల్లప్పుడూ సూచనలు చేస్తుంటారు. అయినప్పటికీ మనం వాటిని పెడ చెవినపెట్టి తప్పుగానే ప్రవర్తించి సమస్యలను కొని తెచ్చుకుంటుంటాం..

Eating on Bed: మంచం మీద కూర్చుని తింటే ఇంట్లో పెద్దోళ్లు ఎందుకు తిడతారో తెలుసా? అసలు కారణం ఇదే
Eating On Bed

Updated on: Apr 18, 2025 | 10:05 AM

మన అలవాట్లే మన భవిష్యత్తు. ఈ మాట చాలా సార్లు వినే ఉంటారు. ప్రతి పనికి ఓ పద్ధతి ఉంటుంది. అలాకాకుండా వేరేలా చేస్తే తిప్పలుతప్పవు. అలాంటి వాటిల్లో భోజనం చేసే పద్ధతి కూడా ఒకటి. ముఖ్యంగా నేటి యువతకు.. కాళ్ళు అడ్డంగా చాపి కూర్చుని తినే అలవాటు చాలా మందిలో ఉంది. ఇది కూడా తప్పు అని పెద్దలు అంటున్నారు. అలాగే కొంతమందికి ఇంట్లో బెడ్‌లపై కూర్చుని గదుల్లోనే గోళ్లెం వేసుకుని తినే అలవాటు కూడా ఉంటుంది. ఇది ఏ మాత్రం మంచి అలవాటు కాదని పెద్దలు చెబుతున్నారు. అందుకే ఇంట్లో బామ్మలు, తాతయ్యలు.. మంచం మీద కూర్చుని తినొద్దని ఎన్నోసార్లు చేబుతుంటారు. చిన్నతనంలో చాలా మందికి గుర్తు ఇది అనుభవమే.. మంచం మీద కూర్చుని ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

శాస్త్రాలలో ప్రతిదానికీ సంబంధించిన నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం ద్వారా మనం జీవితంలో ప్రతికూల ఆలోచనలను అధిగమించవచ్చు. అలాగే చెడు అలవాట్లను అలవర్చుకోవద్దని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటారు. ఇలాంటి అలవాట్లు మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. చిన్నప్పుడు మంచం మీద కూర్చొని తినే అలవాటు ఉండిఉంటే.. ఇంట్లో పెద్దలు మిమ్మల్ని చాలాసార్లు తిట్లే ఉంటారు. ఎందుకు తిట్టారో.. మంచం మీదే భోజనం చేస్తే ఏమవుతుంతో తెలుసా?

పెద్దల ఆచారాల ప్రకారం.. మంచం మీద కూర్చుని భోజనం చేయడం అశుభం. మన సమాజంలో ఆహారానికి ప్రత్యేక స్థానం ఉందని, దానిని అగౌరవపరచకూడదని మన పెద్దలు నమ్ముతారు. మంచం మీద కూర్చుని తినడం ఆహారానికి అగౌరవంగా పరిగణించబడుతుంది. అందుకే మన పెద్దలు ఈ పద్ధతిని వ్యతిరేకిస్తారు. మంచం ఒక అపరిశుభ్రమైన ప్రదేశం. మనం దానిని ఎలా కావాలంటే అలా ఉపయోగిస్తాం. కాబట్టి అది గౌరవప్రదమైన స్థలం కాదు. మంచం మీద తిన్నా, తాగినా లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అంతేకాకుండా రాహువు, బృహస్పతి గ్రహాలు కూడా కోపంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆనందం, శ్రేయస్సులో లక్ష్మీదేవి, రాహువు, బృహస్పతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. జ్యోతిష్యం గురించి పక్కన పెడితే.. భోజనం చేయడానికి సరైన స్థలం వంటగది. గతంలో వంటగదిలో కూర్చునే తినేవాళ్ళు. వంటగదిలో తినడానికి ఒక కారణం ఏమిటంటే, వంటగదిలోనే ఆహారం తయారు చేయడం, అక్కడ వడ్డించడం సులభం, కుటుంబ సభ్యులు వేడివేడిగా కలసి ఉమ్మడిగా తినడానికి అవకాశం ఉంటుంది. అందుకే చాలా ఇళ్లలో వంటగది పక్కనే డైనింగ్ టేబుల్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

భోజనానికి మరో మంచి అలవాటు ఏమిటంటే.. నేలపై లేదా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినడం. ఇది ఆరోగ్యానికి మంచిది. ఇలా చేయడం వల్ల మీ కడుపు నిటారుగా ఉంటుంది. ఆహారం నేరుగా మీ కడుపులోకి వెళుతుంది. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మంచం మీద కూర్చుని తినేటప్పుడు, శరీరం వంగి ఉంటుంది. దీనివల్ల ఆహారం వాయుమార్గంలో చిక్కుకునే ప్రమాదం ఉంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.