
పాత కాలంలో అయితే అందరూ కింద కూర్చుని సహపంక్తి భోజనాలు చేసేశారు. ఏ పనులు ఉన్నా సరే.. తినే సమయానికి అందరూ వచ్చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సమయం చిక్కినప్పుడు అలా ఫుడ్ లాగించేస్తున్నారు. కారులో ప్రయాణిస్తూ.. మీటింగ్‌లో ఉండి కూడా తింటున్నవారు ఉంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో మంచంపై కూర్చుని తినడం అందరికి అలవాటు అయిపోయింది. టీవీ చూస్తూ లేదా సాంగ్స్ వింటే అందరూ మంచంపైనే ఉండి ఫుడ్ తింటున్నారు. ఇది అప్పటికి సౌకర్యంగా అనిపించవచ్చు కానీ.. తర్వాతి కాలంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మనం ఏం తింటున్నాం అనేది మాత్రమే కాదు.. ఎలా తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మంచం మీద కూర్చొని ఎందుకు తినకూడదు? ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం…
అజీర్ణం:
మంచం మీద కూర్చొని భోజనం చేసి, అక్కడే పడుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. ప్రతిరోజూ మంచం మీద భోజనం చేయడం, మంచం మీద వంగి ఉన్న స్థితిలో తినడం జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్ మొదలైన వాటికి కారణమవుతుంది. నిటారుగా కుర్చీలో కూర్చొని భోజనం చేయడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఆహారం మీద నియంత్రణ లేకపోవడం:
సాధారణంగా మనం బెడ్‌పై కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు టీవీలో ఏదో ఒకటి చూస్తుంటాం లేదా ఆన్‌లైన్‌లో ఏదో సెర్చ్ చేస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితిలో మనస్సు చంచలంగా ఉంటుంది. ఈ సందర్భంలో మనం అతిగా తింటాము లేదా తక్కువగా తింటాము. అందువల్ల, మీ బరువు పెరగడానికి లేదా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది
నిద్రకు ఇబ్బంది:
మంచం మీద కూర్చొని భోజనం చేసేటప్పుడు ఆహారం మంచం మీద చిందుతుంది. దీంతో బెడ్‌పై మరకలు పడతాయి. స్మెల్ కూడా వస్తుంది. ఇది మంచి నిద్ర వాతావరణానికి భంగం కలిగిస్తుంది. నిద్రకు ఉపక్రమించే సమయంలో పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని.. నాణ్యమైన నిద్రను పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.
బొద్దింకల టెన్షన్…
సాధారణంగా బెడ్ మీద కూర్చుని ఎలాంటి ఫుడ్ తిన్నా.. అవి మంచం చుట్టు పక్కల లేదా బెడ్ మీద ఖచ్చితంగా పడుతుంది. ఎంత క్లీన్ చేసినా.. ఏదో ఒక చోట ఆహారం పడి ఉంటుంది. ఈ ఆహారం కోసం.. బొద్దింకలు అక్కడికి క్యూ కడతాయి. అంతేకాదు.. రాత్రి నిద్రేంచే సమయంలో మన చెవుల్లో జిగురు స్రవిస్తూ ఉంటుంది. ఈ జిగురుకు.. బొద్దింకలు ఆకర్షితమవుతాయి. అలా నెమ్మదిగా ఈ బొద్దింకలు చెవిలోకి దూరి.. ఇన్‌ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..