Garlic Benefits: వెల్లుల్లితో వెయ్యి లాభాలు.. ఇలా వాడితే ఆరోగ్యంతో పాటు, మెరిసే అందం మీ సొంతం..!

|

Apr 14, 2024 | 7:05 AM

వెల్లుల్లిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని సెలీనియం, అయోడిన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే కలిగే ఉపయోగాలు అనేకం ఉన్నాయి. ఈ టైంలో వెల్లుల్లి తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. వెల్లుల్లి పేస్ట్‌ను వివిధ రూపాల్లో అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. 

Garlic Benefits: వెల్లుల్లితో వెయ్యి లాభాలు.. ఇలా వాడితే ఆరోగ్యంతో పాటు, మెరిసే అందం మీ సొంతం..!
Garlic
Follow us on

Garlic Benefits: వెల్లుల్లి ఆహారం రుచిని పెంచుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో భాస్వరం, జింక్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్లు సి, కె, ఫోలేట్, నియాసిన్, థయామిన్ కూడా వెల్లుల్లిలో పుష్కలంగా లభిస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్, క్రిమినాశక లక్షణాల వల్ల వెల్లుల్లి ఔషధంగా పనిచేస్తుంది.  ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే కలిగే ఉపయోగాలు అనేకం ఉన్నాయి. వెల్లుల్లి తినడం వల్ల మన శరీరంలోని టాక్సిన్స్ సులభంగా క్లీన్ అవుతాయి. పొట్టను శుభ్రపరచడంలో వెల్లుల్లి చాలా ప్రభావవంతంగా ఉంటుందని చెప్పవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత వ్యాధులు దరిచేరవు.

గుండె సంబంధిత సమస్యలకు కూడా వెల్లుల్లి తీసుకోవడం వల్ల మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల రక్తం గడ్డకట్టడం తగ్గుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది. మీరు ప్రతిరోజూ వెల్లు, తేనె మిశ్రమాన్ని తీసుకుంటే కూడా మంచిది. కడుపు సంబంధిత వ్యాధులు ఉన్నవారికి వెల్లుల్లి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇది మన శరీరంలోని విష పదార్థాలను సులభంగా తొలగించి, పొట్టను శుభ్రపరుస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మన శరీరంలో ఏదైనా ఆక్సీకరణ నష్టాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారిస్తాయి.

వెల్లుల్లి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఆస్తమా, న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. దీంతో శ్వాసకోశ వ్యాధులను నివారించవచ్చు. మలబద్దకానికి వెల్లుల్లి దివ్యౌషధం. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య ఉంటే, ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బలను నమలండి. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పంటి నొప్పికి వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది. కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని సెలీనియం, అయోడిన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై ఉండే నల్లని మచ్చలను పోగొడతాయి. వెల్లుల్లి తీసుకుంటే కొల్లాజెన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇందులోని సల్ఫర్, అల్లిసిన్‌లు కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది చర్మం తాలూక ఎలాస్టిసిటీని పెంచుతుంది. దీంతో ముడతలు రావు. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ముడతలు పడకుండా చేస్తాయి. చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి నిత్య యవ్వనంగా ఉండేలా చేస్తాయి.

వెల్లుల్లిలో ఉండే క్రిమిసంహారక గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా మార్చుతాయి. చర్మం కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడు సొరియాసిస్, ఎగ్జిమా వస్తాయి. ఈ టైంలో వెల్లుల్లి తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. వెల్లుల్లి పేస్ట్‌ను వివిధ రూపాల్లో అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…