Skin Care Tips: చర్మం పొడి బారి ఇబ్బంది పెడుతోందా.. ఇంట్లోని వస్తువులతో ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి..

కొంతమంది చర్మం పొడిగా ఉంటుంది. ఇటువంటి చర్మం గలవారు చర్మ సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చిన్న వయసులోనే ముడతలు వచ్చే అవకాశం ఉంది. కనుక చర్మంలో తేమను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజు పొడి చర్మానికి జీవం పోసే 6 సహజ పదార్థాల గురించి తెలుసుకుందాం.. అవి చర్మాన్ని వెన్నలా మృదువుగా చేస్తాయి.

Skin Care Tips: చర్మం పొడి బారి ఇబ్బంది పెడుతోందా.. ఇంట్లోని వస్తువులతో ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి..
Dry Skin Care Home Remedies

Updated on: May 17, 2025 | 10:46 AM

పొడి చర్మం చాలా సాధారణ సమస్య. ఇటువంటి చర్మం కలవారు ఏ సీజన్ లోనైనా జాగ్రత్తగా ఉండాలి. వేసవిలో కూడా వీరు చర్మం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఇటువంటి చర్మం ఉన్నవారు ముఖం నుంచి చేతులు కాళ్ళ వరకు ముడతలతో కనిపిస్తుంది. చర్మంలో తేమ లేనప్పుడు.. చర్మం చాలా బిగుతుగా ముడతలతో నిండి పోతుంది. అందువల్ల, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. అకాల వృద్ధాప్యం కూడా సంభవించవచ్చు. పొడి చర్మానికి తగిన విధంగా పోషణ తీసుకోవడం చాలా ముఖ్యం. దీనితో పాటు హైడ్రేషన్ గా ఉంచుకోవడానికి పుష్కలంగా నీరు త్రాగడం, ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం, నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రస్తుతం పొడి చర్మంలో తేమను నిర్వహించడానికి, చర్మాన్ని పోషించడానికి పనిచేసే కొన్ని పదార్థాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఎవరైనా పొడి చర్మంతో ఇబ్బంది పడుతుంటే.. కఠినమైన సబ్బు ఉపయోగించరాదు. వేడి నీటితో స్నానం చేయరాదు. ఇలా చేయడం వలన చర్మం మరింత పొడిగా మారుతుంది. పొడి చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా సార్లు చర్మంపై గీతలు ,పగుళ్లు వంటి సమస్యలు కూడా వస్తాయి. పొడి చర్మాన్ని మృదువుగా మార్చే అద్భుతమైన పదార్థాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

కలబంద: కలబంద చర్మంపై అద్భుతమైన ప్రభావాలను చూపుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. పొడి చర్మం ఉన్న వారు అలోవెరా జెల్‌లో విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలిపి ప్రతిరోజూ అప్లై చేయండి. ఇది మచ్చలను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బాదం నూనె: బాదం నూనె కూడా చర్మానికి చాలా మంచిది. పొడి చర్మం ఉంటే, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనెను రాయండి. ఇందులో విటమిన్ ఇ కూడా ఉంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. నిస్తేజంగా ఉన్న చర్మానికి కొత్త జీవాన్ని తెస్తుంది.

ఈ స్క్రబ్ ని అప్లై చేయండి: పొడి చర్మం కారణంగా, మృతకణాలు పేరుకుపోతాయి. వీటిని స్క్రబ్బింగ్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. చర్మంలో తేమను కాపాడుకోవడానికి, రంధ్రాలను లోతుగా శుభ్రపరిచే బాదం స్క్రబ్‌ను తయారు చేసుకోవచ్చు. దీని కోసం, బాదం పొడి, తేనె, పెరుగు, లవంగాల పొడి కలపండి. ఈ మిశ్రమంతో చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయండి.

దేశీ నెయ్యి: చర్మానికి పోషణ ఇవ్వడానికి దేశీ నెయ్యిని ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని లోతుగా తేమగా ఉంచుతుంది. ఇది సరళంగా చేస్తుంది. తద్వారా ముడతలు, సన్నని గీతలు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

కొబ్బరి నూనె: చర్మం పొడిగా ఉంటే ముఖం, మెడ, చేతులు, కాళ్ళను వారానికి కనీసం మూడు సార్లు కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి. ఇది చర్మాన్ని లోతుగా పోషించి మృదువుగా చేస్తుంది. కొబ్బరి నూనె అనేక ఇతర చర్మ సమస్యలను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేయాలంటే.. చర్మం పొడిగా ఉంటే పెరుగు, తేనె, చిటికెడు పసుపు, గంధపు పొడి, రోజ్ వాటర్, కలబంద జెల్, గ్లిజరిన్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. ఈ ప్యాక్‌ను ముఖంపై 20 నిమిషాలు అప్లై చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన చర్మానికి మేలు చేస్తుంది. ఇది మీ చర్మాన్ని మృదువుగా చేయడమే కాదు మీ రంగును మెరుగుపరుస్తుంది. సహజమైన మెరుపును తెస్తుంది. ఈ ప్యాక్ టానింగ్ తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)