ఇంగువ వాసన అయితే చూడలేం కానీ.. లాభాలు మాత్రం అమోఘం వీడియో
మనం కొన్ని ఫుడ్ ఐటమ్స్ లో పులిహోర కానీ, సాంబార్ లో కానీ ఇంగువ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. మరి ఇంగువ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఈరోజు తెలుసుకుందాం. చిటికెడు ఇంగువ మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే చాలా ఏళ్లుగా దీన్ని ఆహారంలో ఉపయోగిస్తున్నారు. ఇంగువ ఆరోగ్యానికి చాలా మంచిది. పులిహోర, రసం, సాంబార్, పచ్చళ్ళు అన్నింటిలోనూ వాడుతాం. పదార్థాలు బూజు పట్టకుండా కూడా పనిచేస్తుంది.
ఇంగువ ఇది ఒక ఘాటు అయిన సుగంధ ద్రవ్యం. పొడిగా ముద్దగా రెండు రకాలుగా లభ్యమవుతుంది. చాలా మంది దీని వాసన కారణంగా తినడానికి ఇష్టపడరు. కానీ ఎక్కువ మంది దీన్ని ఆహారం రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఇంగువలో ఫ్లేవోనాయిడ్స్ అలాగే ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. యూరిన్ లో మనకి వ్యర్థ పదార్థాలు ఏమైనా ఉంటే దీనివల్ల బయటకు పోతాయి. ఇంకో విషయం ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ జరగకుండా ఉంటుంది. దీనివల్ల యాసిడిటీ, అజీర్తి, కడుపునొప్పి ఇలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే రైని సీజన్ లోని ఇంగువ ఎక్కువగా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు వైరల్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి దరి చేరకుండా ఉంటాయి. ఇంగువ ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులో గ్యాస్, యాసిడిటీ తగ్గిస్తుంది. ఇది కడుపునొప్పి వంటి ఇతర సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే దగ్గు, జలుబు సమస్యలు తగ్గించడంలో కూడా ఇంగువ పనిచేస్తుంది. మనం రోజూ తీసుకునే ఆహారంలో చిటికెడు ఇంగువను చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మన రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
మరిన్ని వీడియోల కోసం :
హృదయవిదారకం.. కొడుక్కి తల కొరివి పెట్టిన తల్లి వీడియో
ఇంట్లో తాబేలును ఆ దిశలో ఉంచితే .. పట్టిందల్లా బంగారమే వీడియో
ఈ యువకుడు చేసిన పనికి మీరైతే ఏం చేస్తారు?వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

