ఈ యువకుడు చేసిన పనికి మీరైతే ఏం చేస్తారు?వీడియో
జనాలకు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనిపించి బాగా మునిగిపోయింది. ఈ క్రమంలో రకరకాల వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు కొందరైతే సభ్యత మరిచి ప్రవర్తిస్తూ రీల్స్ చేసేవారు మరికొందరు. కొందరు రీల్స్ కోసం బంగారం లాంటి ఖరీదైన వస్తువులను కూడా నాశనం చేస్తూ ఇంట్లోని వారికి నష్టం కలిగిస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆ యువకుడు చేసిన పనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఈ వీడియోలో ఓ యువకుడు వాషింగ్ మిషన్ దగ్గర కూర్చుని ఉన్నాడు. అతను అతని వాషింగ్ మిషన్ పనిచేస్తుందో లేదో చెక్ చేద్దామనుకున్నాడు. అందుకని ఆ మిషన్లో బట్టలు వేయడానికి బదులు ఓ పెద్ద రాయిని తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో వేసి స్విచ్ ఆన్ చేశాడు. వెంటనే ఆన్ అయిన వాషింగ్ మిషన్ ఆ రాయిని సూపర్ గా వాష్ చేసింది. ఈ క్రమంలో వాషింగ్ మిషన్ ముక్కలు ముక్కలుగా ఏ పార్టుకు ఆ పార్టు ఉడిపోయింది. అయినా ఆ మిషన్ డ్రమ్ రాయిని ఉతుకుతూనే ఉంది. మిషన్ నుంచి బయటకు వచ్చేసిన డ్రమ్ తిరిగి మళ్ళీ మిషన్లోకి వెళ్ళింది. మొత్తానికి ఆ యువకుడు వాషింగ్ మిషన్ను సర్వనాశనం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఇదేం పిచ్చిరా స్వామి బంగారం లాంటి మిషన్ను ముక్కలు చేసేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో
