Lifestyle: ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

|

Apr 20, 2024 | 10:22 AM

అయితే పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో. పండ్లున తిన్న వెంటనే నీటిని తాగితే అంతకంటే ఎక్కువ నష్టం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల పండ్లను తిన్న వెంటనే నీటిని తాగితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి పండ్లను తీసుకున్న తర్వాత నీటిని తాగితే ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
Drinking Water
Follow us on

పండ్లు ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు పండ్లతో చెక్‌ పెట్టొచ్చని చెబుతారు. ముఖ్యంగా సీజనల్‌ ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయొచ్చని సూచిస్తుంటారు.

అయితే పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో. పండ్లున తిన్న వెంటనే నీటిని తాగితే అంతకంటే ఎక్కువ నష్టం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల పండ్లను తిన్న వెంటనే నీటిని తాగితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి పండ్లను తీసుకున్న తర్వాత నీటిని తాగితే ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* యాపిల్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే యాపిల్‌ తిన్నవెంటనే నీళ్లు తాగితే మాత్రం మంచిది కాదు. దీనివల్ల కడుపునొప్పి, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అలాగే జీర్ణక్రియపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అజీర్ణం, గ్యాస్ సమస్యలు వస్తాయి.

* అరటి పండు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసిందే. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే అరటి పండు తినగానే నీరు తాగితే.. అది జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి. అలాగే బ్లడ్‌ షుగర్‌పై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

* నీటిశాతం అధికంగా ఉండే పుచ్చకాయ తిన్న తర్వాత నీరు తాగితే కూడా ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..