ఉప్పు మన ఆహారంలో ముఖ్యమైన భాగం. ఉప్పు లేని ఆహారం తినడం చాలా కష్టం. ఎందుకంటే చప్పగా ఉంటుంది. అయితే ఆహారంలో ఉప్పు తీసుకోవడమే కాదు, రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపిన నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి ఖాళీ కడుపుతో ఉప్పునీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగడం వల్ల రోజంతా శరీరం హైడ్రేట్ గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల అనేక వ్యాధులకు ఇది దివ్యౌషధంలా పని చేస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఉప్పునీరు ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నీటిలో ఉప్పు కలిపి రోజూ తాగితే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఉదయాన్నే ఉప్పునీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థలోని యాసిడ్ బ్యాలెన్స్ అవుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఉప్పు నీరు శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జలుబు, దగ్గు మొదలైన ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఉప్పునీరు తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఉప్పునీరు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇది మొటిమలు, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇది చుండ్రును కూడా తొలగిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. అంతేకాకుండా, ఉప్పునీరు మూత్రపిండాలు,కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉప్పునీరు తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. అయితే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తాయి. అతి అస్సలొద్దు.
గమనిక: ఇక్కడ ఉన్న విషయాలు సమాచారం కోసం మాత్రమే. మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.