ఓరి దేవుడో.. స్వచ్ఛమైన తాగునీటిని అందించే వాటర్ ప్యూరిఫైయర్‌ గురించి నమ్మలేని చేదు నిజం..!

|

Apr 25, 2023 | 5:24 PM

ప్రస్తుతం చాలా మంది ప్రజలు తమ ఇళ్లల్లో స్వచ్ఛమైన తాగునీటి కోసం RO వాటర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. RO వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అనివార్యమైంది. అయితే, ఆర్‌ఓ వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఒక చేదు నిజం బయటపడి అందరినీ షాక్‌కు గురి చేసింది.

ఓరి దేవుడో.. స్వచ్ఛమైన తాగునీటిని అందించే వాటర్ ప్యూరిఫైయర్‌ గురించి నమ్మలేని చేదు నిజం..!
Ro Water Purifier
Follow us on

మారుతున్న జీవనశైలితో ప్రతి ఒక్కరి అవసరాలు కూడా మారుతున్నాయి. ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో నిత్యావసర వస్తువుల్లో RO ఒకటిగా మారింది. RO అంటే రివర్స్ ఆస్మాసిస్. ఇది కలుషితమైన నీటిని శుద్ధి చేసే పరికరం. ప్రస్తుతం చాలా మంది ప్రజలు తమ ఇళ్లల్లో స్వచ్ఛమైన తాగునీటి కోసం RO వాటర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. RO వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అనివార్యమైంది. అయితే, ఆర్‌ఓ వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఒక చేదు నిజం బయటపడి అందరినీ షాక్‌కు గురి చేసింది. వాస్తవానికి, కలుషితమైన నీటిని శుభ్రపరిచే RO ఈ సమయంలో సహజంగా ఉండే కొన్ని అవసరమైన ఖనిజాలు, విటమిన్‌లను కూడా తొలగిస్తుంది. ఈ ఆర్‌ఓ నీటిని ఎక్కువ కాలం తాగడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ బి12 లోపానికి దారితీస్తుందని తాజా పరిశోధనలో షాకింగ్ సమాచారం వెల్లడైంది.

శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే ఏమి జరుగుతుంది?

విటమిన్ B12 రక్త ప్రసరణ వ్యవస్థ, నరాలు, రక్తం ఏర్పడటానికి అవసరమైన విటమిన్. శరీరంలో విటమిన్ B12 లోపం అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

శరీర సమతుల్యతను కాపాడుకోవడంలో ఇబ్బంది:

శరీరంలో విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు శరీర సమతుల్యతను కాపాడుకోవడంలో సమస్య ఏర్పడుతుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

గర్భధారణ సమయంలో సమస్య:

విటమిన్ బి12 శిశువు ఎదుగుదలకు చాలా అవసరం. శరీరంలో విటమిన్ బి12 లోపం వల్ల గర్భధారణ సమయంలో అనేక సమస్యలు వస్తాయి.

రక్తహీనత:

విటమిన్ B12 లోపం ప్రధానంగా శరీరంలో రక్తహీనత లోపానికి దారితీస్తుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు మూలం కావచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..