Raw Milk Benefits: వారెవ్వా.. పచ్చి పాలతో ఇన్ని ప్రయోజనాలా..? అవేమిటో తెలిస్తే ఆగమన్నా ఆగకుండా తాగేస్తారు..

|

Feb 06, 2023 | 4:02 PM

క్రమం తప్పకుండా పాలను తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకు పాలలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం, కాల్షియం, జింక్, విటమిన్ డి, పొటాషియం వంటి పలు పోషకాలే..

Raw Milk Benefits: వారెవ్వా.. పచ్చి పాలతో ఇన్ని ప్రయోజనాలా..? అవేమిటో తెలిస్తే ఆగమన్నా ఆగకుండా తాగేస్తారు..
milk
Follow us on

క్రమం తప్పకుండా పాలను తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకు పాలలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం, కాల్షియం, జింక్, విటమిన్ డి, పొటాషియం వంటి పలు పోషకాలే కారణమని చెప్పుకోవాలి. అయితే మనలో అధికశాతం మంది పాలను వేడి చేసి తాగుతారు. కానీ వేడి పాల కంటే పచ్చి పాలను తాగితేనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మరి వారి సూచనల ప్రకారం పచ్చి పాలతో కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

చల్లటి పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

  1. వెయిట్ లాస్: మనలో చాలా మంది బరువు తగ్గడానికి కఠినమైన వ్యాయామం, పుడ్ తక్కువ తినకుండా ఉండడం లాంటివి చేస్తుంటారు. అయినా సరే కొన్ని సార్లు బరువు తగ్గలేం. అలాంటప్పుడు పచ్చి పాలు తాగడం మంచిది. ఎందుకంటే పాలలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది బాడీలోని అదనపు కేలరీలను బర్న్ చేసి బరువు తగ్గడంలో సాయం చేస్తుంది.
  2. కడుపు మంటకు చెక్: మీకు కడుపులో మంటగా అనిపించడం లేదా అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. పచ్చి పాలు మీకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.  ఈ హెల్తీ డ్రింక్ ద్వారా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఎముకలను దృఢ పరచడంలో, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో, షుగర్‌ను అదుపులో ఉంచడానికి పచ్చి పాలు అద్భుతంగా పనిచేస్తాయి.
  3. చర్మ సమస్యలు : పచ్చి పాలలో చాలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఈ కారణంగా పచ్చి పాలను తాగితే మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాదు. అంతేకాకుండా మీ శరీర చర్మానికి నిగారింపు వస్తుంది. స్కిన్ డిసీజ్, అలెర్జీ ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం  పచ్చి పాలు తాగడం అలవాటు చేసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. పచ్చి పాలు మీ చర్మానికి అత్యుత్తమ మెరుపును అందిస్తాయి. పచ్చి పాలలో విటమిన్లు బి12, ఎ, డి, బి6, బయోటిన్, కాల్షియం, ప్రొటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి చర్మ పోషణకు ఉత్తమమైన పదార్ధం. మీరు కాటన్ బాల్‌తో మీ ముఖానికి పాలను అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి శుభ్రం చేసుకుంటే గ్లో పెరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..