Diabetes Rice: అన్నం తిన్నా.. షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే.. రైస్‌ను ఇలా వండండి!

డయాబెటీస్ ఉన్న వారు, అధిక బరువు ఉన్నవారు అన్నం తినాలంటేనే భయపడిపోతుంటారు. ఎందుకంటే అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిని తినడం వల్ల బాడీలో కార్బోహైడ్రేట్స్ పెరిగి బరువుతో పాటు షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయని వాళ్ల టెన్షన్.. అయితే అలాంటి వారికే ఈ గుడ్‌న్యూస్.. అన్నం తిన్నా మీ బాడిలో షుగర్‌ను కంట్రోల్‌ ఉంచుకోవచ్చు. అదెలానో వైద్యుల నిపుణుల ద్వారా తెలుసుకుందాం పదండి.

Diabetes Rice: అన్నం తిన్నా.. షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే.. రైస్‌ను ఇలా వండండి!
Boiling Bhindi With Rice (1)

Updated on: Jan 01, 2026 | 5:37 PM

అన్నం తినడం వల్ల శరీరంలో కార్బోహైడ్రెడ్స్‌ పెరుగుతాయన్న మాట వాస్తవమే.. కానీ కొన్ని చిట్కాలను పాటించడం వల్ల వాటి పెరుగుదలను నెమ్మది చేయవచ్చు. దానితో పాటు మీ బాడిలో షుగర్‌తో పాటు బరువు పెరగడాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఇందుకు మీరు పెద్దగా కష్టపడాల్ని అవసరం కూడా లేదు. కేవలం అన్నం వండేటప్పుడు అందులో కొన్ని బెండకాయలు, లేదా బంగాళాదుంపలు వేసుకుంటే సరిపోతుంది. దీని వల్ల అన్నం త్వరగా అవ్వడమే కాకుండా ఔషధంలా మారుతుంది. ఇది మేము చెబుతున్న విషయం కాదు.. వైద్య నిపుణులు డాక్టర్ సంతోష్ జాకోబ్ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇలా అన్నంలో బెండకాయలు కలిపి వండుకొని తినడం ద్వారా మన బాడిలో షుగర్ లెవల్స్‌ పెరగకుండా కంట్రోల్‌లోనే ఉంటాయట.


బియ్యంలో బెండకాయలు కలిపి ఉడికించడం వల్ల లాభాలు

అన్నం వండే సమయంలో బెండకాయల్ని వేయడం ద్వారా బెండకాయల్లో ఉండే సహజ జెల్ అయిన మజిలేజ్ ప్రతీ ధాన్యానికి చేరుతుంది. అంతేకాదు బెండకాయల్లోని పోషకాలు, విటమిన్స్, ఫైబర్ అన్నీ అన్నంలో కలుస్తాయి. ఇలా వండిన అన్నం తినడం వల్ల అది మంచిగా జీర్ణం అవుతుంది. బెండకాయల్లో ఉండే ఫైబర్ అన్నంలో కలిసినప్పుడు జీర్ణప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఇది చక్కెర పెరుగుదలను నెమ్మది చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థరంగా ఉంచుతుంది. ఈ అన్నం ప్రీ బయోటిక్‌గా పనిచేసి పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది.

బెంగకాలయ వల్ల ప్రయోజనాలు

బెండకాయల్లో చాలా తేలికైన కేలరీలు ఉంటాయి. వీటితో పాటు బెండకాయల్లో ఉండే మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ సి, కె1 ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి.

బరువును నియంత్రించడం

బెండకాయలను బియ్యంతో కలిపి ఉడికించినప్పుడు వాటిలోని పోషకాలు అన్నంతో కలుస్తాయి. ఈ అన్నం తినడం వల్ల అది చక్కగా జీర్ణం అవుతుంది. దీంతో మనకు ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు, లేదా నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెల్‌, నివేదికల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.