
ప్రతీ అనారోగ్య సమస్యకు సంబంధించి శరీరం ముందుగానే మనల్ని అలర్ట్ చేస్తుంది. కొన్ని రకాల లక్షణాల ఆధారంగా శరీరంలో జరిగే ప్రమాదాలను ముందే హెచ్చరిస్తుంది. అయితే ఆ లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే చాలా సులభంగా సమస్య నుంచి బయటపడొచ్చు. ఇంతకీ శరీరం తెలిపే ఆ లక్షణాలు ఏంటి..? ఏ లక్షణం ఎలాంటి వ్యాధికి సంకేతాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కడుపు నొప్పి అనేది సర్వసాధారణం. మనలో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. కడుపు నొప్పికి ఎన్నో రకాల కారణాలు ఉంఆయి. చాలా వరకు జీర్ణ సంబంధిత కారణాల వల్ల కడుపు నొప్పి వేధిస్తుంటుంది. అయితే ఈ సమస్యకు చాలా సులభంగా పరిష్కారం దొరుకుతుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో విపరీతమైన కడుపునొప్పి వస్తుంటుంది. ఇంతకీ ఏయే సందర్భాల్లో కడుపు నొప్పి వస్తుంది.? ఇప్పుడు తెలుసుకుందాం..
* పొత్తికడుపులో నిరంతరం నొప్పిగా ఉంటే అది మూత్రపిండాల్లో రాళ్ల వల్ల కావొచ్చని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం చాలా మందిలో మూత్ర పిండాల్లో రాళ్ల సమస్య వస్తోంది. శరీరంలో కాల్షియం చేరడం వల్ల రాళ్లు ఏర్పాడుతున్నాయి. స్టోన్ పరిమాణం చిన్నగా ఉంటే మూత్రం ద్వారా శరీరం నుంచిబయటకు వెళ్లిపోతాయి. కానీ పెద్ద పరిమాణం ఉంటే పొత్తి కడుపుతో పాటు వీపు కింద భరించలేని నొప్పికి కారణమవుతుంది.
* ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే దీర్ఘకాలిక సమస్య. సింపుల్‌గా చెప్పాలంటే పేగులో అడ్డంకులు ఏర్పడడాన్ని ఈ సమస్యగా చెబుతారు. పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి రావడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఈ సమస్యలో ప్రధానంగా కనిపించే లక్షణాలు.. డయేరియా, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉంటాయి.
* నాభిపైన దీర్ఘకాలంగా నొప్పి ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కడుపులో కణితి వల్ల ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది క్యాన్సర్‌కు ముందస్తు సూచన కావొచ్చని హెచ్చరిస్తున్నారు. కడుపులో నొప్పి, అజీర్ణం, గుండెలో మంట వంటివి పెద్దపేగు క్యాన్సర్ ముందస్తు లక్షణాలుగా చెప్పొచ్చు.
* పొత్తి కడుపు కింది భాగంలో నిరంతరంగా నొప్పితో బాధపడుతుంటే.. అది అపెండిసైటిస్‌కు సంకేతం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అపెండిక్స్ అనేది పెద్ద ప్రేగు దగ్గర ట్యూబ్ లాంటి నిర్మాణం. అపెండిసైటిస్ ప్రారంభ లక్షణాలు.. జ్వరం, విరేచనాలు, వాంతులు, బలహీనత, ఆకలి లేకపోవడం, కడుపులో నొప్పి వంటివి.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..