Lifestyle: చలికాలం స్నానం చేసేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..

|

Nov 29, 2024 | 6:17 PM

చలికాలం ఆరోగ్యం విషయంలో కొన్ని చిట్కాలను కచ్చితంగా పాటించాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా స్నానం చేసే సమయంలో మనం చేసే కొన్ని తప్పులు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు. ఇంతకీ చలికాలం స్నానం విషయంలో తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: చలికాలం స్నానం చేసేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
Bath Tips
Follow us on

చలికాలం జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. మారిన వాతావరణంలో వ్యాధులు సోకకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. అయితే మనకు తెలిసో తెలియకో కొన్ని మిస్టేక్స్‌ చేస్తుంటాం. అలాంటి వాటిలో స్నానం విషయంలో చేసే తప్పులు కొన్ని. సాధారణంగా చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తుంటాం. అయితే ఎక్కువ వేడి ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుందని నిపుణులు చెబుతున్నారు.

దీంతో చర్మం పగలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక చలికాలం తరచుగా తలస్నానం చేయడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నెత్తుపై ఉండే చర్మం పొడిబారడం వల్ల చుండ్రు సమస్య వేధిస్తుంది. అలాగే కెమికల్స్‌ ఎక్కువగా ఉండే షాంపూలను ఉపయోగించడం వల్ల కూడా ఈ చుండ్రు వేధిస్తుంది. కాబట్టి వేడి నీటితో తలస్నానం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక ముఖానికి సబ్బులను కూడా ఉపయోగించవచ్చు. సబ్బుకు బదులుగా శనగపిండిని శరీరానికి అప్లై చేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఇక చలికాలంలో చేయకూడని మరో తప్పు టవల్‌ని ఎక్కువ రోజులు ఉతక్కుండా ఉండడం. టవల్స్‌ను ఎక్కువ రోజులు ఉతక్కపోతే.. టవల్స్‌లో ఫంగస్‌ పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి టవల్‌ను ఉపయోగించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

అందుకే కచ్చితంగా క్రమంతప్పకుండా టవల్‌ను బాగా ఉతకాలి. అలాగే ఉతికిన టవల్‌ను మంచి ఎండలో ఆరబెట్టాలి. తేమగా ఉండే టవల్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. అలాగే వింటర్‌లో కాటన్‌ టవల్స్‌ను ఉపయోగించాలి. ఇవి శరీరంపై నీటిని పీల్చుకుంటాయి. ఇక స్నానం చేసేప్పుడు ఉపయోగించే స్క్రబ్బర్స్‌ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రబ్బర్స్‌ను శుభ్రం చేయకపోతే వాటిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది చర్మం సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..