
నోటి ఆరోగ్యం శరీర ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని తెలిసిందే. అందుకే నోటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. కనీసం రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోమని చెప్పేది ఇందుకే. ఇక బ్రష్‌తో పాటు మౌత్ వాష్ చేసుకోవాలని కూడా సూచిస్తుంటారు. మౌత్ వాష్ కోసం మార్కెట్లో ఎన్నో రకాల మౌత్ ఫ్రెషనర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మనలో కొందరు బ్రష్ చేసిన వెంటనే మౌత్ వాష్ చేస్తుంటారు. ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బ్రష్ చేయగానే మౌత్ వాష్ చేస్తే జరిగే నష్టం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రష్ చేసుకున్న వెంటనే మౌత్ వాష్ చేయడం వల్ల దంతాల్లోని జీవ కణజాలం కుళ్లిపోయి దంతక్షయం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ఓ కారణం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనం ఉపయోగించే టూత్ పేస్టులో 1450pp ఫ్లోరైడ్ ఉంటుంది. మీ మౌత్ వాష్‌లో 220pp ఫ్లోరైడ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి బ్రష్ చేసిన వెంటనే మౌత్ వాష్ చేసుకుంటే.. దంతాలపై గల ఫ్లోరైడ్ శాతం తగ్గిపోతుంది. కేవలంలో మౌత్ వాష్‌లో ఉండే తక్కువ స్థాయి ఫ్లోరైడ్ మాత్రమే మిగులుతుంది అని చెబుతున్నారు. మౌత్ వాష్ వల్ల ఉపయోగాలు ఉన్నాయన్న విషయంలో ఎంత వరకు నిజం ఉందో.. బ్రష్ చేసిన వెంటనే మౌత్ వాస్ చేసుకుంటే అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంతకీ మౌత్ వాష్ ఎప్పుడు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రష్ చేసిన వెంటనే కాకుండా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మౌత్ వాష్ చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే మౌత్ వాష్ చేసుకుంటే.. దంతాల్లో ఇరుక్కు ఆహారపదార్థాలు తొలగిపోతాయి. దీంతో దంతక్షయం సమస్య దరిచేరదు. అలాగే మౌత్ వాష్ చేసుకున్న తర్వాత 30 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా మౌత్ వాష్ చేసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..