
ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కేవలం వీధి కుక్కలే కాదు.. సరిగ్గా శిక్షణ లేని పెంపుడు కుక్కలు కూడా ఒక్కోసారి దాడి చేస్తుంటాయి. చాలామంది కుక్క కరిచినప్పుడు అది చిన్న గాయమే కదా అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఆ నిర్లక్ష్యం రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు కుక్క కరిచినప్పుడు ప్రాథమిక చికిత్స ఎలా చేయాలి? వైద్య సహాయం ఎందుకు అవసరం అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కుక్కలు ఊరికే దాడి చేయవు. వాటి దూకుడు వెనుక కొన్ని కారణాలు ఉంటాయి.
అంతర్లీన అనారోగ్యం: ఏదైనా వ్యాధి లేదా నొప్పితో బాధపడుతున్నప్పుడు కుక్కలు వింతగా ప్రవర్తిస్తాయి.
రక్షణ భావం: తమ పిల్లలకు లేదా ఆహారానికి ముప్పు ఉందని భావించినప్పుడు దాడికి దిగుతాయి.
రేబిస్ ప్రభావం: రేబిస్ సోకిన కుక్కలు విచక్షణ కోల్పోయి ఎదురుగా ఎవరున్నా కరుస్తాయి.
కుక్క కరిచిన వెంటనే ఆసుపత్రికి వెళ్లేలోపు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
గాయాన్ని శుభ్రం చేయండి: గాయమైన చోట ట్యాప్ నీటి కింద ఉంచి, సుమారు 5 నుండి 10 నిమిషాల పాటు తేలికపాటి సబ్బుతో కడగాలి. ఇది లాలాజలంలోని వైరస్ తీవ్రతను తగ్గిస్తుంది.
రక్తస్రావాన్ని ఆపండి: గాయం నుండి రక్తం కారుతుంటే, శుభ్రమైన గుడ్డతో మెల్లగా నొక్కి పట్టి రక్తస్రావాన్ని అరికట్టండి.
యాంటీబయాటిక్ క్రీమ్: మీ వద్ద అందుబాటులో ఉంటే, గాయంపై యాంటీబయాటిక్ క్రీమ్ రాయండి.
బ్యాండేజ్: గాయాన్ని దుమ్ము పడకుండా స్టెరైల్ బ్యాండేజ్ లేదా శుభ్రమైన గుడ్డతో కట్టండి.
కుక్క కాటు విషయంలో సొంత వైద్యం అస్సలు వద్దు. డాక్టర్ దగ్గరకు వెళ్లడం వల్ల కలిగే ప్రయోజనాలు..
కుక్క కరిచిన తర్వాత బాధితుడిలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర చికిత్స అందించాలి..
రేబిస్ వ్యాధికి చికిత్స లేదు.. కానీ నివారణ మాత్రమే మార్గం. కుక్క కరిచిన వెంటనే వాక్సిన్ తీసుకోవడం ద్వారా 100శాతం ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండటం, పెంపుడు కుక్కలకు సకాలంలో టీకాలు వేయించడం అందరి బాధ్యత.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..